Cold Wave's: తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పొగమంచు సైతం పెరిగింది.
Weather Warning: వేసవి ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత భానుడు భగభగ మండుతుండటంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
ఫిబ్రవరి నెల నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. మార్చి నెల సగమైనా గడవక ముందే వాతావరణం మండువేసవిని తలపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు! గత ఏడాదితో పోల్చితే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి.
Temperatures Rise in Telangana State: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు అప్పుడే ముదిరిపోయాయి. ఇంకా మార్చి నెల కూడా రాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.…
Temperatures increasing in Telangana: మొన్నటివరకు వణికించిన చలి.. ఇటీవలి రోజుల్లో తగ్గుముఖం పట్టింది. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా దాదాపుగా అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. 5 రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా.. 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది. మరోవైపు హైదరాబాద్‌లో 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్‌నగర్, మెదక్, భద్రాచలం, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ ఎండ…