Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. పెద్ద వాగు వరద పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయ సమీపంలో15మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తటంతో వరదలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతో పాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలు అందించారు.
చాలామంది దైనందిన జీవితాల్లో సోషల్ మీడియా ఒక భాగమైపోయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకూ వినియోగిస్తున్నారు. భారతీయులు సోషల్ మీడియా మీద సగటున రోజుకు 2 గంటల 40 నిమిషాలు గడుపుతున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నటి నుండి బడిబాట కార్యక్రమం మొదలయింది. జూన్ 19 వరకు కొనసాగనున్న ఈ బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, ఆపై అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించబోతున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సరికొత్త ప్రచారం షురూ చేయనున్నారు అధికారులు. ఈ ప్రచారాన్ని అమ్మ కమిటీలకే…
లోక్సభ ఎన్నికల ఫలితాల పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశామన్నారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు, ఎదుర్కొన్నామన్నారు.
D. Sridhar Babu: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
BRS Protest: నేడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేడు ఆందోళనకు పిలుపు నిచ్చింది.