Heavy Rains: హైదరాబాద్ లో జోరువాన.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
- నగరంలో ఆదివారం రాత్రి నుంచి దంచి కొడుతున్న వాన..
- ఏపీ-తెలంగాణలో రెండు రోజులు భారీ వర్ష సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెంలలో వర్షం కురుస్తుంది.
Read also: Mosambi Juice: ఓరి దీనమ్మ బత్తాయో.. బత్తాయి జ్యూస్‌లో ఇంత మ్యాటర్ ఉందా.?
Also Read
భాగ్యనగరం హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సికింద్రాబాద్‌లోనూ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. నిన్న ఆదివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, హైటెక్ సిటీ, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షంతో వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కనే నిలిపివేశారు.
మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకటి రెండు చోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
Read also: MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..
దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Shiva Parayanam: సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!