తెలంగాణ ప్రజలకు మరోమారు షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్దమైంది. ప్రయాణీకులపై మళ్లీ భారం మోపేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్, డీజిల్ సెస్, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ అంటూ దాదాపు 35 శాతం వరకు టీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే సామాన్యుల, విధ్యార్థులు ఈభారాన్ని మోపలేని స్థితిలో నెట్టుకొస్తున్నా అయినప్పటికీ టీఎస్ ఆర్టీసీ నష్టం వస్తుందని మరోసారి టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమమయ్యింది. సగటున 20 నుంచి 30…
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రయాణికుల బస్‌పాస్‌లపై పెను ప్రభావం చూపింది. ఆర్టీసీ పిడుగుపాటులా పెంచిన చార్జీలతో ప్రయాణికులపై అశనిపాతమే అయింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు ఆఫ్‌లైన్ చదువులతో ఢక్కామొక్కీలు తిన్న విద్యార్థులు.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పరిస్థితులతో స్కూళ్లు, కాలేజీలకు, ఉద్యోగాలకు వెలుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్ చార్జీలు గ్రేటర్‌లోని లక్షలాది మంది ప్రయాణికులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.165 తో నెల రోజుల…
పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. May 23 నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపిన ప్రకటన.. ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా ..…
నష్టాల కారణంగా తెలంగాణలో ఆర్టీసీ బస్సు డిపోలు మూసివేస్తున్నారని.. గత రెండు రోజుల నుంచి ఓ వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. బస్సు డిపోలను మూసేస్తున్నారు.. భూములు అమ్ముతున్నారనే వార్తలు వస్తున్నాయని… కానీ, ఆర్టీసీ యాజమాన్యానికి అలాంటి ఆలోచన లేదన్నారు సజ్జనార్. ఆర్టీసీ బస్సు డిపోలు మూసివేస్తున్నారనేది పూర్తి అవాస్తవమని వెల్లడించారు. ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని.. కొన్ని కారణాల వల్ల…
తెలంగాణ ఆర్టీసీ దూకుడు మీద ఉంది. పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసిన సజ్జనార్ ఆర్టీసీలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని క్రమంగా ప్రజలకు చేరువ చేస్తూ లాభాల బాట ఎక్కించేందుకు సజ్జనార్ ఎన్నో వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా పలుమార్లు స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త సర్వీసులు, ట్రిప్పులతో ప్రజలకు ఆర్టీసీని…
తెలంగాణ ఆర్టీసీని సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ సెట్ చేస్తారా? పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ముద్రపడ్డ ఆయన్ని ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీకి పంపింది? ఎవరికి చెక్ పెట్టేందుకు తీసుకొచ్చారు? ఆర్టీసీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సీనియర్ ఐపీఎస్‌తో మంత్రికి సఖ్యత కుదురుతుందా? తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు MDగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ వచ్చారు. ఈ నియామకంపై ఆర్టీసీతోపాటు.. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీకి పూర్తిస్థాయి MD…