తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త రూల్ తీసుకొచ్చింది. ఉద్యోగులు సకాలంలో విధులకు రాకుంటే రోజుకు రెండుసార్లు రిజిష్టర్‌పై సంతకాలు చేయాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ టైమ్ దాటితే ఉద్యోగులు ఇక రావాల్సిన అవసరం లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి ఉద్యోగులు ఆఫీసులకు ఆలస్యంగా రావడానికి వీల్లేదని టీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. రోజూ ఉదయం 10.45 గంటల తర్వాత కార్యాలయానికి రావాల్సిన పని లేదని ఉత్తర్వులు జారీ చేసింది. హాజరు రిజిష్టర్‌పై ఉదయం 10.30 గంటలకు ఒకసారి, సాయంత్రం 4.30 గంటలకు రెండోసారి సంతకం చేయాలి. క్షేత్రస్థాయిలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక నుంచి ఆఫీసులకు ఆలస్యంగా వచ్చేవారిని, డిపోల్లోని అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు, డిస్పెన్సరీల తనిఖీల్లో సిబ్బంది సమయానికి కార్యాలయాలకు రావడంలేదని ఇటీవల విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సమయపాలనపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు ఉదయం పదిన్నర గంటలలోపు కార్యాలయానికి వచ్చి 10.45 గంటలకు రిజిస్టర్‌ను మూసివేయాలి. 6 నెలల వ్యవధిలో ఆరుసార్లు ఆలస్యంగా వచ్చిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఇక నుంచి ఉద్యోగులు హాజరు రిజిష్టర్‌లో ఉదయం 10.30 గంటలకు ఒకసారి, సాయంత్రం 4.30 గంటలకు రెండోసారి సంతకం చేయాలని పేర్కొంది.