School Holiday: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (సెప్టెంబర్ 2) రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఏపీలో వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. బాధితుల వద్దకు రెస్క్యూ బృందాలు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరద బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు.
వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి…
నగరంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో ప్రజలు హైదరాబాద్ మెట్రో రైల్ ఫ్లై ఓవర్, చెట్ల కింద తలదాచుకున్నారు. ‘రక్షాబంధన్’ సందర్భంగా మధ్యాహ్నం తమ బంధువుల ఇళ్లకు వెళ్తున్న అనేక కుటుంబాలు వర్షంలో చిక్కుకుని మెట్రో ఫ్లైఓవర్ కింద వేచి ఉండాల్సి వచ్చింది. అరగంట తర్వాత వర్షం తగ్గిన తర్వాతే ముందుకు సాగారు. సికింద్రాబాద్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. షేక్‌పేట వద్ద సెంట్రల్ మీడియన్‌కు ఇరువైపులా వర్షం నీరు చేరడంతో…
First Danger Warning Soon at Bhadrachalam: భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం 20 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం.. ఆదివారం ఉదయానికి 39 అడుగులకు చేరుకుంది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం వరద పోటెత్తుతోంది. భద్రాచలం ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రాత్రికి ఇది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి రావచ్చని ఇప్పటికే అధికార యంత్రాంగానికి సీడబ్ల్యుసీ హెచ్చరికలు జారీ…