Heavy Rains: హైదరాబాద్ ను కమ్మేసిన వాన మబ్బులు.. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు..
- బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం..
- రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌లో ఉదయం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. దాంతో పగలు చీకట్లు కమ్ముకున్నాయి. రాబోయే 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు భారీ వర్షాలు కురిసే సూచన ఉండటంతో రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పది జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ కు ఐఎండీ అలెర్ట్ చేసింది. నగరానికి భారీ వర్ష సూచన జారీ చేసింది. అవసరం అయితేగానీ బయటకు వెళ్లొద్దని హైదరాబాదీలకు ఐఎండీ సూచన ఇచ్చింది. సిటీకి భారీ వర్ష సూచనతో అధికారులను అలెర్ట్ చేసింది.
Read also: 35 Lakh Stolen: హైదరాబాద్ లో దొంగల హల్ చల్.. రూ.35 లక్షలు దోపిడీ..
Also Read
మూసీ పరీవాహక ప్రాంతాలు అలెర్ట్ గా ఉండాలని అధికారుల హెచ్చరించారు. వరద ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. కాగా, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారేందుకు మరో 24 గంటల సమయం పట్టనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెల్లవారుజామున చీకటి పడుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అధికారులు కూడా బయటకు రావద్దని సూచిస్తున్నారు.
GAIL Jobs: 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్న గెయిల్..
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?