తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్&కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం (11 సెప్టెంబర్) నాడు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా..…
ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు.. ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారబోతోందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. సోలార్…
మూడు రోజుల పాటు ఏక దాటినా వచ్చిన వర్షాలకి పాలేరు రిజర్వాయర్ నుంచి భారీ ఎత్తున వరద వచ్చింది. పాలేరు రిజర్వాయర్ సామర్ధ్యాన్ని మించి వరదలు వచ్చాయి రిజర్వాయర్లో 21 అడుగుల సామర్థ్యం ఉంటే దాదాపుగా 39 అడుగుల సామర్థ్యం స్థాయి వరద పాలేరుకు వచ్చింది సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీరు పాలేరు రిజర్వాయర్ కి రావటంతో దాని ప్రభావం కాలువల మీద పడింది. వరద కూడా సాగర్ కాలువల మీద పడింది. దీంతో పాలేరు…
AP and Telangana Rains LIVE UPDATES: వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రేపు కూడా తెలంగాణలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రానున్న 24 గంటలలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికలున్న 11 జిల్లాలైన ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి,…
సూర్యాపేట జిల్లాలో వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారుల నివేదిక ప్రకారం 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరిగిందని.. ప్రజలకు విశ్వాసం కలిగించేందుకే తన పర్యటన అంటూ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారని, నివేదిక సమర్పించారని సీఎం తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ,మహబూబాబాద్‌లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించినట్లు ఫైర్ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, కోదాడలో చాలామందిని ఫైర్ సిబ్బంది రక్షించినట్లు తెలిపారు.
తెలంగాణకు భారీ వాన గండం తప్పినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో క్రమంగా వాయుగుండం బలహీన పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు విదర్భ – రామగుండం దగ్గర వాయుగుండం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో పూర్తిగా వాయుగుండం బలహీన పడనున్నట్లు, ఈ నేపథ్యంలో తెలంగాణలో నేడు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి రాబోయే ఐదు…
ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడారు. మున్నెరు వాగు ఉదృతంగా ప్రవహించటంతో ప్రకాష్ నగర్ లో పెద్ద ఎత్తున వరద వచ్చిందన్నారు. దీంతో రక్షణ చర్యలు చేపట్టాడానికి అటంకం ఏర్పడిందని, వాతావరణం అనుకూలించక రక్షణ చర్యలు లేట్ అవ్వటంతో బాధితులు అసహనం వ్యక్తం చేశారని అన్నారు. వాతావరణం అనుకూలించక తెలంగాణ హెలిప్యాడ్ రావటానికి ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. ఆంధ్ర హెలిప్యాడ్‌లో ప్యూయిల్ నింపుకొని వచ్చే వరకు ఆలస్యం అయిందని తెలిపారు. మున్నెరు బ్రిడ్జి…