తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది… నిన్న రాత్రి వరకు 177 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. ఇవాళ ఉదయం నుంచి 96 రైళ్లను రద్దు చేసింది… నిన్న రాత్రి వరకు 120 రైళ్ళను దారి మళ్ళించింది… ఇవాళ ఉదయం నుంచి 22 రైళ్లను దారి మళ్ళించింది… నిన్న రాత్రి వరకు 9 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది ఇవాళ దాదాపుగా 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది……
కోదాడ, హుజుర్‌నగర్ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. వర్ష ఉధృతికి గండ్లు పడ్డ ప్రాంతాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శిస్తున్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం రామచంద్రాపురం శివారులో సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ రెడ్డిలు పరిశీలించారు. వీరితో పాటు నీటిపారుదల శాఖాధికారులు సి.ఇ రమేష్ బాబు, యస్.ఇ శివధర్మ తదితరులు…
కృష్ణమ్మ ఉధృతితో కొట్టుకొస్తున్న బోట్లు.. విజయవాడ రైల్వే బ్యారేజీకి 3 అడుగుల దూరంలో వరద నీరు విజయవాడలోని కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో విజయవాడలోని రైల్వే బ్యారేజ్ కి మూడు అడుగుల దూరంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గమ్మ వారధి మీదుగా, ప్రవహిస్తున్న లక్షల క్యూసెక్కుల నీరు.. ప్రకాశం బ్యారేజీ దిగువకు విడుదల…
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 90శాతానికి చేరుకుంది. మరి కొన్ని గంటలలో ప్రాజెక్టు వరద గేట్లుఎత్తి గోదావరి నదిలోకి వదిలి అవకాశం ఉంది. కావున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యంగా రైతులు చేపలు పట్టేవారు పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని విజ్ఞప్తి చేశారు ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండింగ్.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 2న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో, సెప్టెంబర్ 3 నుండి పరీక్షలు టైమ్ టేబుల్ ప్రకారం నిర్వహించబడతాయని తెలిపారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను నిర్ణీత సమయంలో తెలియజేస్తాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాల సూచన…
శని, ఆదివారాల్లో కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల కంటే సిద్దిపేట జిల్లాలో ఎక్కువ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సిద్దిపేటలోని మిరుదొడ్డి మండలంలో 152.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ కాలంలో సిద్దిపేటలోని 12 మండలాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, మెదక్‌లోని రెండు మండలాల్లో 100…
దక్షిణ మధ్య రైల్వేలో భారీగా రైళ్లను రద్దు చేసింది. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే రవాణా వ్యవస్థ స్థంభించింది. ఒకే సారి 80కి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భారీ వర్షాలతో రైల్వే ట్రాక్ ల మీదకు వరద నీరు చేరుకుంది. రైల్వే ఉన్నతాధికారులు రైల్వే నిలయం డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూం నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతికి కేసముద్రం, విజయవాడ రాయంపాడు ట్రాక్ ల మీద నుంచి వరద…
మహబూబాబాద్ జిల్లాలో విషాదం మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి తండ్రి కూతురు నీట మునిగి చనిపోయారు. ఆదివారం ఉదయం మరిపెడ (మ) పురుషోత్తమాయగూడెం దగ్గర ఉన్న బ్రిడ్జి పై నుండి వరదనీరు.. ప్రవహిస్తున్న ప్రవాహాన్ని అంచనా వేయకుండా వెళ్లిన కారు కొట్టుకొని పోయి ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్వినిగా గుర్తింపు. కారులో తండ్రీకూతురు ఇద్దరూ హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరారు.…
హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య.. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి.. భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్ (40), వర్షిణి (33)గా గుర్తించారు. వీరికి రిషికాంత్ (11), విహంత్ (3) పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆన్ లైన్ బెట్టింగ్ వ్యాపారం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ…
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపద్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24/7 అప్రమత్తంగా ఉండాలన్నారు. *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…