TS Red Alert: తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ.. 20 సెంటీ మీటర్ల వర్షం కురిసే ఛాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Red Alert: నైరుతి రుతుపవనాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. ఇవాళ దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అయితే రానున్న మూడు రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, అస్మానాబాదు, నిర్మల్, నిర్మల్ , ఆదిలాబాద్, జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రేపు కూడా హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, జనగాం, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read also: Bike Romance: కదులుతున్న బైకుపై సరసాలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ఈనెల 20 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. 20వ తేదీన మంచిర్యాల, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. . 21న ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే 22న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నిన్న ములుగు జిల్లాలో 8.0, నిజామాబాద్ జిల్లాలో 7.7, ఆదిలాబాద్ జిల్లాలో 6.4, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6.2, నిర్మల్ జిల్లాలో 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
Nabha Natesh Hot Pics: షర్ట్ బటన్ తీసేసి.. టెంప్ట్ చేస్తున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!