Telangana Rains: ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.. జూలై 24న వాయవ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో ఒడిశాకు పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూలై 24న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హనుమకొండ, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 26 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు.
Read also: Venkateswara Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ సంకల్పాలు నెరవేరుతాయి
Also Read
హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఈరోజు సాయంత్రానికి మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వరదల కారణంగా హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో నీరు పడిపోతోంది. భారీ వరదలతో మూసీ నది పొంగిపొర్లుతోంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గోదావరి ఉద్ధృతికి భద్రాచలం వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు మరో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈరోజు సెలవులు ప్రకటించింది.
Rajasthan: మణిపూర్ గురించి మాట్లాడాడు.. మంత్రి పదవి పోయింది
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!