Kalvakuntla Kavitha : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడుతూ.. “సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్‌లో ఉన్నప్పటికీ, రాజకీయాల గురించి తప్పకుండా మాట్లాడుతాను. ప్రజలకు మేలు జరగాలంటే పార్టీలు అవసరం అనేది తప్పనిసరి కాదు. ప్రజలు కోరుకుంటే, సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుంది” అని అన్నారు. జాగృతి…
KTR : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలు తెలుగు ప్రజలకు తలవంచుకునే పరిస్థితి తెచ్చాయని ఆయన విమర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాలు రాష్ట్ర పరువుకు మచ్చలాంటివి. ఐఏఎస్ అధికారులను బలి పశువులుగా మార్చే పరిస్థితి వచ్చింది,”…
KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీత పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో, బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…
Vivek vs Harish Rao : సిద్ధిపేటలో జరిగే కళ్యాణాలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈసారి రాజకీయ వాతావరణంతో మారింది. కార్యక్రమంలో మంత్రి వివేక్ , మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. మంత్రి వివేక్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పదేళ్లలో ఒక్క రేషన్ కార్డును కూడా ఇవ్వలేదని విమర్శించారు. దానికి ప్రతిస్పందనగా, హరీష్ రావు స్పందిస్తూ.. “మా పాలనలో 6.50 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. కాదని నిరూపిస్తే, ఇక్కడే రాజీనామా…
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం తెలంగాణ జన సమితి (టీజేఎస్) కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్‌ను కలిశారు.
KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారు. రేపు ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జ్‌లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు కేసీఆర్. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి తగిన వ్యూహం రూపకల్పనపై చర్చలు జరగనున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను అధికారులు లోనికి అనుమతించారు. ఆర్వో కార్యాలయం కాంపౌండ్ లో భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. Also Read:Renu Desai…
Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత మూడు సెట్ల…
పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీపైన తొలి దెబ్బను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ కొట్టబోతోందని అన్నారు.