Home
Telangana Politics
Telangana Politics News
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
Telangana Assembly: అసెంబ్లీ ప్రాంగణంలో వరుసగా చోటుచేసుకున్న ఘర్షణలు, నిరసనల నేపథ్యంలో శాసనసభలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభా హుందాతనాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని, అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ సభ ముగిసే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, మాధవరం, మాణిక్‌రావు, చింత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సంజయ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సుధీర్‌రెడ్డి, అనిల్‌యాదవ్, గంగుల కమలాకర్‌తో సహా… -
Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్.. సభలో రూల్స్‌పై బిగ్ ప్రశ్న.!
Akbaruddin Owaisi : తెలంగాణ శాసనసభలో సభ నిబంధనల అమలుపై AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో నిబంధనలు ప్రతిపక్ష సభ్యులకు ఒకలా, అధికార పార్టీ సభ్యులకు మరోలా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. అందరికీ సమానంగా నిబంధనలు వర్తించేలా చూడాలని కోరారు. టీ-షర్ట్ ఘటనను గుర్తుచేసిన ఒవైసీ గతంలో తమ పార్టీకి చెందిన సభ్యుడు టీ-షర్ట్ ధరించి సభకు వచ్చినప్పుడు.. దానిపై ఉన్న అక్షరాలను చూపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసి, సభలోకి… -
Bandi Sanjay : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు అమానుషం
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభ, శాసన మండలి ప్రస్తుతం విమర్శలు, ప్రతివిమర్శలు, దాడులకు వేదికగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, మండలిలో ఇదేం రాజకీయం? ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాల్సిన చట్టసభలు రాజకీయ విమర్శలకు కేంద్రాలుగా మారడం సరికాదని బండి సంజయ్ అన్నారు. ప్రజా… -
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళా నేతలపై దాడిని ఖండించిన కేటీఆర్ శాసనసభ వేదికగా తమ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకులు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా… -
BRS MLCs : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బిగ్ రిలీఫ్.. రిమాండ్‌కు కోర్టు నో
తెలంగాణ రాజకీయంలో తీవ్ర ఉత్కంఠ రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్ట్ వ్యవహారంలో వారికి న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలపై నమోదైన కేసులో వీరిద్దరినీ రిమాండ్‌కు తరలించాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను నాంపల్లి క్రిమినల్ కోర్టు తోసిపుచ్చింది. రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన న్యాయస్థానం, ఎమ్మెల్సీలిద్దరినీ తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ముట్టడి, అరెస్టే నేపథ్యం తెలంగాణ… -
Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
Harish Rao : తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు దాటినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని హరీశ్ రావు ఆరోపించారు. ప్రజలకు… -
BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
KTR, Harish Rao Arrested: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ తో పాటు కొందరు ఎమ్మెల్యేలను బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. నిన్న (సోమవారం) అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. దీంతో దామరకుంట దగ్గర ఉద్రిక్తత… -
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
Gaddam Prasad: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. అసెంబ్లీ ముట్టడి, అధికారులపై దాడులు, స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నేతల ప్రవర్తనపై ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీకి రాగానే స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయనను పరామర్శించారు. ఇక, సోమవారం అసెంబ్లీ తొలిరోజే బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.… -
Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
Siddipet District: సిద్దిపేట జిల్లా దామరకుంట దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై బీఆర్ఎస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల సైతం కలుగజేసుకోవడంతో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎర్రవల్లికి బయలుదేరారు. -
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
Seethakka: స్పీకర్‌ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలని మంత్రి సీతక్క శాసన మండలిలో డిమాండ్ చేశారు. మంగళవారం శాసన మండలి సమావేశాల్లో ఆమె మాట్లాడారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టి వేశారని మండిపడ్డారు. మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన, దళిత వ్యతిరేక నైజం మీది బీఆర్ఎస్దని మండిపడ్డారు. ఎస్సీ,…
తాజావార్తలు
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!