మండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారు.. దీని గుర్తించి తమ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చైర్మన్ న్యూసెన్స్ చేయవద్దని కామెంట్ చేశారు. మండలి చైర్మన్గా న్యూసెన్స్ అనే పదం వాడారు.. దాన్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. రుణమాఫీపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట అమలు చేశామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రుణమాఫీ చేశామన్నారు.
తెలంగాణ శాసన సభ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి ప్రారంభమైన కాసేపటికే శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించాలని.. పసుపు రైతులను వెంటనే ఆదుకోవాలి అంటూ నిరసన చేపట్టారు.
KTR : బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) తన పార్టీ నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రహస్య సమావేశం నిర్వహించారని గతంలో మండిపడ్డ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలపై అధికారికంగా సమీక్షలు నిర్వహించాలి కానీ, రహస్యంగా బీజేపీ నేతలతో…
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ఢిల్లీ పర్యటనలు చేస్తూ, అక్కడి నుంచి రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి మొత్తం 39 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, రాష్ట్రాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ తీరు “గల్లీలో హోదా మరిచి తిట్లు, ఢిల్లీలో చిట్చాట్లు” అన్నట్లు ఉందని, తన కార్యాలయం దాటి బయటకి…
Raghunandan Rao : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుమతించకపోతే, రాష్ట్రంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు కలిసి తిరుమలలో టీటీడీ అధికారులతో తేల్చుకుంటామని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు హెచ్చరించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ద్వారా భక్తులకు దర్శన అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు,…
Kunamneni Sambasiva Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీ లో స్పీకర్ చైర్కు గౌరవం ఇవ్వడం సభ్యులందరి బాధ్యత అని అన్నారు. సభ్యులు సభలో సంయమనంతో, ఆచితూచి మాట్లాడాలని సూచించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రభుత్వానికి కూనంనేని సూచించారు. ఈ సందర్భంగా, సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవడం అవసరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలపై…
MLC Vijayashanti : తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె బీఆర్ఎస్పై, కేసీఆర్పై, అలాగే బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీని బలవంతంగా విలీనం చేశారని ఆమె ఆరోపించారు. విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్ కంటే ముందే క్రియాశీలంగా పాల్గొన్నానని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్కు సొంతం కాదని స్పష్టం చేశారు. “నా పార్టీని బలవంతంగా విలీనం చేశారు. తెలంగాణ కోసం…
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యతాలకుంట గ్రామంలో సీతారామ టన్నెల్ వద్ద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై విశేషాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉందని, తాను రాజకీయ చైతన్యం వచ్చినప్పటి నుండి అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను విస్తృతంగా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం ప్రతి గిరిజన గ్రామానికి రహదారులు…
Jagadish Reddy : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై స్పందించారు. తనపై నిషేధాన్ని అన్యాయంగా అమలు చేశారనే ఆరోపణలు చేస్తూ, అసెంబ్లీ లోపల తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. NTV తో మాట్లాడుతూ జగదీష్ రెడ్డి తనపై తప్పుడు నిర్ధారణలతో మోపారని ఆరోపించారు. “నేను స్పీకర్ పై ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వం చేసే తప్పులను బయటపెడుతున్నానని నన్ను లక్ష్యంగా చేసుకున్నారు,”…