ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై.. వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీహెచ్ ఇంట్లో భేటీకి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కీలక నేతలు హాజరయ్యారు.
ఎమ్మెల్సీ చింతపండు నీవన్ (తీన్నార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలాకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది.
వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టు ప్రాంగణం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్ పోర్ట్కు ఆమోదం రావడంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేరువేరుగా సంబరాలు చేసుకుంటున్నారు.
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల వరకు తీసుకెళ్లే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ, “కిషన్ రెడ్డి మాటలు వింటుంటే రైల్లో మనకే డబ్బులు పంపినట్టు మాట్లాడుతున్నారు. ప్రజల నుంచి అడిగి హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మేము…
Meenakshi Natarajan తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియమితుడైన ఏఐసీసీ ఇంచార్జీ, మీనాక్షి నటరాజన్ శుక్రవారం ఉదయం తెలంగాణ చేరుకున్నారు. ఆమె ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి సాధారణ రైల్లో రావడం విశేషం. కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్న ఆమెను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా స్వాగతించారు. మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు కండువా కప్పి మరింత ఆతిథ్యం అందించారు. ఈ ఘట్టం రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఆనందాన్ని కలిగించింది. మీనాక్షి నటరాజన్ అనంతరం గాంధీ…
Uttam Kumar Reddy : మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనులను పూర్తి చేయకుండా వదిలేసిందని మండిపడ్డారు. ఆ పనులు పూర్తయి ఉంటే నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చేదని పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని అందరూ చూడటానికి ప్రభుత్వం…
TPCC Mahesh Goud : ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, మాజీ మంత్రులుగా కనీస మినహాయింపు లేకుండా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం సిగ్గుచేటని టిడిసిసి చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులమడం అలవాటైపోయిందని, శవాలపై రాజకీయం చేయడం వారి నైజమని ఆయన ధ్వజమెత్తారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 24 గంటల పాటు రిస్క్యూ టీమ్స్…
Etela Rajender : గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారిందని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే ఈ మాత్రం పనులు కూడా కనిపించవన్నారు. సీసీ రోడ్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, స్మశాన వాటికలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి..వీటిపై చర్చకు వస్తారా రండని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 25…