Harish Rao : తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల నిర్వహణపై స్పష్టతనిచ్చేందుకు నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని, సభ నిర్వహణ తీరుపై పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సభను ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు. బీఏసీ సమావేశం అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో…
TG Assembly: రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వాడివేడిగా సాగనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు , ఇతర రాజకీయ పరిణామాలను గమనిస్తే, ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీకి హాజరు కానుండటం చర్చనీయాంశంగా మారింది. సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే పకడ్బందీ వ్యూహాలను సిద్ధం చేసుకుంది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి…
KCR : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు సమరశంఖం పూరించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమై పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేశారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ నీటి కేటాయింపులకు అంగీకరించడం ద్వారా దక్షిణ తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఈ…
CM Revanth Reddy : నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్ల సన్మాన వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ , ఆయన కుటుంబంపై నిప్పులు చెరిగారు. అత్యంత ఘాటైన పదజాలంతో విరుచుకుపడిన సీఎం, తనను , తన కుటుంబాన్ని గతంలో కేసీఆర్ వేధించారని, జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేసుకున్నారు. “నన్ను జైల్లో పెట్టి అణచివేయాలని చూశారు, కానీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే…
Bhatti Vikramarka : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. శాసనసభకు వచ్చే ధైర్యం లేని వారు, బయట ఉండి అడ్డగోలుగా మాట్లాడటం తగదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. “రాష్ట్రంలోని 85…
Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాను అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాతో పాటు అగ్ర నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయడంతో వల్ల ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారు.
KTR: తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు.. "పక్కా మాఫియా పాలన" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారు.