TPCC Mahesh Goud : కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలు, బీఆర్ఎస్ ప్రకటించిన “దీక్షా దివస్”పై స్పందిస్తూ, బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోల్పోయిన పార్టీగా మారిందని, మళ్ళీ కనిపించేందుకు కొత్త నాటకాలే ఆశ్రయిస్తోందని అన్నారు. కేసీఆర్ గతంలో చేసిన తెలంగాణ రాష్ట్ర దీక్షను పూర్తిగా నాటకమని అభివర్ణిస్తూ, ఎనిమిది రోజుల దీక్షలో ఆయన ఆసుపత్రిలోనే సెలైన్ ఎక్కించుకున్నారని, విటమిన్ ఇంజెక్షన్లు తీసుకున్నారని మహేష్ గౌడ్…
Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా నాణ్యమైన ఆహారం అందించలేని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నం అందించిన ఘటనను గుర్తుచేస్తూ, “ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో…
TG Local Body Elections: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను…
Kavitha : తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని వ్యాఖ్యానించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇవాళ ఆమె మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని, ఇంకా నేను ప్రజల్లో తిరగాలన్నారు. నా జనంబాట కార్యక్రమంలో.. మహిళల నుంచి పార్టీ పెట్టాలన్న డిమాండ్ ఎక్కువ వస్తుందని ఆమె వెల్లడించారు. కొత్త పార్టీదేముందని, ఎప్పుడైనా పెట్టొచ్చన్నారు కవిత. కానీ ప్రజల సమస్యలు తీర్చేలా కొత్త పార్టీ ఉండాలని ఆమె వెల్లడించారు. కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా…
మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే ల్యాండ్ స్కాం బయట పెట్టిన తమ పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పవర్ స్కాంను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
హనుమకొండలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు.
సంగారెడ్డిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పినా కూడా తాను మళ్లీ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. “సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని ఓడించినా ఇంట్లో కూర్చోను. పదేళ్లుగా అధికారం లేకున్నా సర్పంచ్, ఎంపీటీసీ,…
CM Revanth Reddy : వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని ఎన్కేపల్లి రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వ కట్టుబాటును స్పష్టం చేస్తూ, ముందున్న పది సంవత్సరాలు ‘ఇందిరమ్మ రాజ్యం’గా నిలుస్తాయని సీఎం ప్రకటించారు. అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా కొనసాగిద్దామని ప్రజలను పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రూ. 5 వేల కోట్లతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం…
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.
Off The Record: అసలే ఓడిపోయిన బాధలో ఉన్న ఆ పార్టీకి పంచ్‌ల మీద పంచ్‌లు పడుతున్నాయా? ఎద్దు పుండును కాకి పొడిచినట్టుగా సలుపుతోందా? బీఆర్ఎస్ టార్గెట్‌గా కవిత చేస్తున్న తాజా కామెంట్స్‌ని ఎలా చూడాలి?