CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బ్యాడ్ బ్రదర్స్.. కిషన్ రెడ్డి, కేటీఆర్.. ఇద్దరు కలిసి మెట్రో విస్తరణ అపుతున్నారని ఆయన ఆరోపించారు. పీజేఆర్.. శశిధర్ రెడ్డి లు హైదరాబాద్ బ్రదర్స్.. హైదరాబాద్ బ్రదర్స్ అభివృద్ధి చేశారు.. బ్యాడ్ బ్రదర్స్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విజ్ఞతతో ఆలోచించి.. అభివృద్ధి పథం వైపు నడిపేందుకు ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 25 వేలకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే.. మీరేం (కిషన్ రెడ్డి) చెబితే అందుకు తాను సిద్ధం అని చెప్పారు. 25 వేల ఓట్లు బీజేపీ అభ్యర్థికి రాకపోతే.. తాను చెప్పింది చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్…
Bandi Sanjay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన బండి సంజయ్ మీటింగ్ను నిలిపేశారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు ప్రశ్నించారు.
Kishan Reddy: ఓటు వేయక పోతే సన్న బియ్యం, ఫ్రీ బస్ ఆగిపోతుంది అని సీఎం అన్నారు.. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం.. ఏ విధంగా సీఎం ఆపుతారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను, వచ్చిన సంస్థల వివరాలు కిషన్రెడ్డి వివరించారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో బీబీనగర్ ఎయిమ్స్ భవనాలు…
KK Report : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వే వివాదం రచ్చ రేపుతోంది. కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే రిపోర్ట్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) సాయిరాం ను కలసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ భేటీ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, కేకే సర్వే సంస్థ…
KTR: హైడ్రా పెద్దవాళ్లని వదిలిపెట్టి పేదవాళ్ళ మీద పడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. పేద వల్ల బాధ అందరికీ తెలవాలని ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం.. పేదవాళ్లు కూలి పని చేసుకుని ఇటుక ఇటుక పేర్కొని కట్టుకున్న ఇండ్లను కూల్చేశారన్నారు. వాళ్లు పెద్దవాళ్లకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు చెప్పగలుగుతారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో హైడ్రావల్ల అనేకమంది రోడ్లమీద పడ్డారు..
KTR slammed Revanth Reddy: భారత ఆర్మీపై రేవంత్ రెడ్డి చేసిన నీచమైన కామెంట్స్ ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. భారత ఆర్మీకి క్షమాపణ చెప్పాలన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకోవడంపైన కేటీఆర్ మండిపడ్డారు. సైన్యంలో చేరి, తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి అపారమైన కృషి, అంకితభావం, నిబద్ధత, దేశంపై ప్రేమ అవసరమన్నారు. యూనిఫామ్ ధరించిన మన సైనికులు అత్యంత కఠినమైన…