'SIR' In Telangana: కేంద్ర ఎన్నికల సంఘం నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ను ప్రారంభించింది. ఇప్పటికే, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియ రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈసీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, యూపీ ఇలా పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను చేపట్టింది. ముఖ్యంగా, ఈ ప్రక్రియపై బీజేపేతర ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
KCR : చాలా కాలం తర్వాత తెలంగాణ భవన్‌కు విచ్చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తనను దూషించడమే కాంగ్రెస్ సర్కార్ ఒక విధానంగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ఒక్క కొత్త ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రకటించకపోగా, గతంలో ఉన్న పథకాలను కూడా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కిట్ వంటి పథకాలను ఆపేశారని, బస్తీ దవాఖానాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల కోసం…
TPCC Mahesh Goud : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల ముందే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల…
KCR : తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న కాంగ్రెస్ పాలన కేవలం తనను దూషించడం, అవమానించడమే పరమావధిగా పెట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, తనపై వ్యక్తిగత…
KCR: తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తదితరులు హాజరుకానున్నారు. మొత్తం సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ పార్టీ కేంద్ర…
తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ను దేశం నుంచి తరిమి కొట్టాలి.. దేశంలో మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.. ఏపీలో కూకటి వేళ్ళతో పెకిలించి సముద్రంలో కలిపారు..
Off The Record: కాంగ్రెస్ పార్టీ అంటేనే విచ్చలవిడి అంతర్గత ప్రజాస్వామ్యం. ఒక్క గాంధీల కుటుంబాన్ని తప్ప… మిగతా వాళ్ళలో ఎవరు ఎవర్ని అయినా, ఏమైనా అనవచ్చంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ స్వేచ్ఛ ముసుగులో ఇప్పుడు కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ప్రకటించి కలకలం రేపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. అలాంటి వాళ్ళవల్ల పార్టీకి తీరని నష్టం జరిగిపోతోందని, గాంధీభవన్‌లో తీసుకున్న నిర్ణయాలు క్షణాల్లో బీఆర్ఎస్ ఆఫీస్‌కు చేరిపోతున్నాయన్నది ఆయన వాదన. ఆ పార్టీ…
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ఆరో రోజు కూడా కొనసాగుతోంది. ఈ విచారణ రేపటితో ముగియనున్న నేపథ్యంలో, సిట్ (SIT) బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలో ప్రధానంగా సాంకేతిక అంశాలతో పాటు, అప్పటి రాజకీయ నాయకుల ఫోన్లను ఏ విధంగా ట్యాపింగ్ చేశారనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దల…
Telangana: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి విస్తరణపై చాలా రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలో తెరపడే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, జనవరిలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిమండలిలో మరో ఇద్దరు మంత్రులను తీసుకోవడానికి వీలుంది, అంటే రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురిని తొలగిస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే,…