KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీల రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. “బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేసి డ్రామాలు చేస్తోంది. ఆర్. కృష్ణయ్యతో సహా కొంతమంది బీసీ నేతలు కూడా డ్రామాలు ఆపాలని ఆయన అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చిత్తశుద్ధి చూపలేకపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా, ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిగా చేయలేదు. గత 79 ఏళ్లలో 12 మంది రెడ్డి వర్గానికి చెందిన వారినే ముఖ్యమంత్రులుగా చేశారని ఆయన అన్నారు. కేవలం 5 శాతం ఉన్న రెడ్డిలకు అవకాశం ఇవ్వగా, 52 శాతం ఉన్న బీసీలకు మాత్రం ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని మండిపడ్డారు.
Madhavi Latha: బీజేపీ పెద్దలను కలిసిన మాధవీలత.. జూబ్లీహిల్స్ సీటు ఖాయం కానుందా!
అలాగే, నేను బీసీల కోసం పార్టీ స్థాపించాను. బీసీల హక్కుల కోసం పోరాడటమే ప్రజాశాంతి పార్టీ లక్ష్యం అని స్పష్టం చేశారు కే.ఏ. పాల్. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే హనుమంతరావు, మల్లు రవి లేదా వివేక్ లాంటి బీసీ నేతలలో ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని.. కానీ, వాళ్లు బీసీలను కేవలం ఓట్ల బ్యాంక్‌గా మాత్రమే వాడుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. కే.ఏ. పాల్ బీసీ వర్గానికి పిలుపునిస్తూ.. బీసీలు ఇక బానిసత్వం మానాలి. మూడు కుల కుటుంబ పార్టీలను ఓడించేందుకు ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం పిటిషన్లు వేసే వారు, నిజంగా బీసీ హక్కులు కోరుకుంటే బీసీ పార్టీకి ఓటు వేయాలి అని అన్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కూడా స్పందించిన కే.ఏ. పాల్, జూబ్లీహిల్స్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. నేను స్వయంగా పోటీ చేస్తానా లేదా మరెవరినైనా నిలబెడతానా అన్నది త్వరలో ప్రకటిస్తానని అన్నారు.
Fire Accident: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం..