Minister Seethakka: యూరియా కొరత పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు. కావాలనే బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి రోడ్లపై ధర్నా చేయిస్తున్నారని విమర్శించారు. నేడు కామారెడ్డిలో పర్యటించిన ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క.
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు.
MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశంపై మాట్లాడారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తానూ రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దీనికి ప్లానింగ్ అంత కిషన్ రెడ్డి చేశారని ఆరోపించారు. తాను ఎప్పుడూ విమర్శలు చేయలేదని చెప్పారు.. కేంద్ర పెద్దల ఆశీర్వాదం, యోగి ఆధిత్యానాథ్ ఆశీర్వాదం తనకు ఉందన్నారు. గోషామహాల్లో ఎవరికి పార్టీ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. ఇవాళ కూడా నా…
MLA Raja Singh: తనను టార్గెట్ చేస్తూ బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.. తాను బీజేపీకి రాజీనామా జరగడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు.. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తనను టార్గెట్ చేస్తారని అడిగారు. తాను బీజేపీ కార్యకర్తల కోసం మాట్లాడానన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 10 నుంచి 12 మందిని సికింద్రబాద్ పార్లమెంట్ నుంచి తీసుకున్నారని చెప్పారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ తమకు అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు వేగవంతం చేసింది. సుదీర్ఘంగా 9 నెలల పాటు సాగిన విచారణ అనంతరం, ఈ కేసులో కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించింది.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసు 'లొట్టపీసు కేసు' అని, ఇందులో ఎలాంటి స్కాం జరగలేదని ఆయన అన్నారు.
హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవకతవకలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ రేస్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ గత తొమ్మిది నెలలుగా విచారణ జరిపింది.
తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించిన ఆయన, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో తప్పులు జరిగాయని కోర్టు నమ్మినట్లు తెలిపారు.
సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. సీఎం పై తెలంగాణ బిజెపి వేసిన పరువు నష్టం దావా పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ కీలక వాఖ్యలు చేశారు. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దని, కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెప్తూనే ఉన్నాయన్నారు చీఫ్ జస్టిస్. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి అని స్పష్టం చేశారాయన. కేసు…