టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి చెక్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతల్లో కోత విధించింది. ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. ఆయనకు గతంలో ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. జగ్గారెడ్డి కి అప్పగించిన బాధ్యతల్లో……
అందరూ ఊహించినట్లే జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా బరిలోకి దించింది. పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ అభ్యర్థిగా హర్భజన్ సింగ్‌ను ఆప్ ప్రకటించింది. ఈ మేరకు భజ్జీ.. సోమవారం ఛండీగఢ్‌లో నామినేషన్ దాఖలు చేశాడు. ఆప్ రాజ్యసభ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాడు. 2.దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది..…
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరింత స్ఫష్టత ఇచ్చారు. యాసంగి సీజన్ లోనూ కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి…
రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీకి బలమయిన ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం అంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో బండి సంజయ్ అనేక అంశాలు ప్రస్తావించారు. రెండేళ్ళ పదవీకాలం చాలా సంతృప్తినిచ్చింది. అందరి సహకారం, నేతల సలహాలతో లక్ష్యాల వైపు అడుగులేశా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీని అధికారంలోకి తెస్తాం. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో మేం గెలిచాం. టీఆర్ఎస్ డబ్బులు బాగా ఖర్చుపెట్టింది. నియోజకవర్గాలు అన్నింటిలో మేం పోటీచేశాం. మాకు నాయకులు తక్కువ…
1.చికెన్ ప్రియులకు ఇది చేదు వార్తే.. రోజురోజుకు చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. దీనితో నాన్ వెజ్ లేకుంటే ముద్దయిన దిగని వాళ్లకు చికెన్ కొనాలంటే జేబులు చిల్లవుతున్నాయి. విజయవాడలో కేజీ ధర రూ.306 చేరుకుంది. అలాగే హైదరాబాద్‌లో కూడా ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా కిలో చికెన్ ధర రూ.281కు పెరిగింది. ఫిబ్రవరి 7న కిలోరూ.185 ఉన్న ధర ఒక్కసారిగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.281లుగా విక్రయిస్తున్నారు. అయితే సరుకు తక్కువగా…
1.తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. మంత్రులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు.. ఎర్రవెల్లిలోని తమ ఫామ్‌హౌస్‌కి రావాలంటూ ఆయన నుంచి మంత్రులకు సమాచారం వెళ్లింది.. అయితే, ఆకస్మాత్తుగా భేటీ కావడంతో.. ఏ అంశాలపై చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫోన్ కాల్ రావడంతో.. హుటాహుటిన తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని.. ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్… 2.గ్రామ స్వరాజ్యం అంటూ…
1.ఏపీలో మద్యం బ్రాండ్లపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్తీ సారా అరికట్టాలి.. రాష్ట్రంలో జె బ్రాండ్స్ మద్యం నిషేధించాలి అనే డిమాండ్‌తో రేపు ఎల్లుండి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. మద్యం పై ప్రభుత్వాన్ని గ్రామ స్థాయి నేతలు, క్యాడర్ నిలదీయాలి. సీఎం జగన్ ధన దాహంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు. 2.యాదాద్రి నరసింహ స్వామి దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త.. గతంలో…
1.యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సు, 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం నాడు ఆమోదం పలికింది. ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్, సోషల్, హ్యూమానిటీస్, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ తెలిపింది. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. 2.ఏపీ సీఎం జగన్ పై నిప్పులు…
1 రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ మాటలు అర్ధరహితమని మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మెదక్‌లోని టీఎన్జీవో భవన్లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడానికే సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నడని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కేసీఆర్ వ్యతిరేకమని ఆయన విమర్శించారు. పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛను ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉందని, సీఎం కేసీఆర్ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకి అని ఆరోపించారు. 2.14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగియడంతో…
1.ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతోంది. రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడుల్లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో రష్యా మిస్సైల్ దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ మరణించాడు. 2.దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు…