PM warangal tour: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్రంలో వరుస పర్యటనలు, కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర కీలక నేతలు ఇక తెలంగాణపై దృష్టి సారించారు.
Bandi sanjay: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. పొంగులేటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరతారని స్పష్టమైనప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
ఖమ్మం జిల్లా కల్లూరులో బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వైద్య,ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. బీజేపీ వాళ్లు తెలంగాణలో గెలుస్తాం అని మాట్లాడుతున్నారని.. కానీ ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కాదు కదా.. డిపాజిట్ కూడా రాదన్నారు. జిల్లాలో డిపాజిట్ రాని పార్టీ రాష్ట్రం లో అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు.
ఇందిరాపార్క్ వద్ద దీక్షకు బయలుదేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల పోలీసులను ప్రశ్నించారు.