Ravindra Bharathi: సీతారాం ఏచూరి సంస్మరణ సభ.. ఒకే వేదికపై సీఎం రేవంత్, కేటీఆర్..
- నేడు రవీంద్ర భారతిలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ..
- హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి- కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Bharathi: హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈరోజు ఉదయం 11 గంటలకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కార్మిక ఉపాధి శాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ నెల 12న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభరం అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, వివిధ వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలను ఆహ్వానించారు.
ఇటీవల సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపిస్తారనే వార్త రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇద్దరిలో ఒకరు వెళ్లిన తర్వాత మరొకరు వస్తారా?… లేక సీతారాం ఏచూరి సంస్మరణ సభ వారిద్దరినీ కలిపే వేదిక అవుతుందా? రాజకీయ విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తపడతారా?… లేదంటే ఇద్దరి మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంటుందా? అనే దానిపై గుసగుసలు వినపిస్తున్నాయి. సీతారాం ఏచూరి సంస్మరణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున ఆ అంశానికే పరిమితమయ్యేలా తమ్మినేని వీరభరం చొరవ తీసుకుంటారా? అనే దానిపై ఉత్కంఠంగా మారింది.
Tirumala Laddu controversy: తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి..! ఇప్పుడిదే హాట్ టాపిక్..
Also Read
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!