గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలతు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది.
ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు.
తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
లగచర్ల రైతులకు బేడీల విషయంపై అసెంబ్లీ చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతులకు బేడీల విషయంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్ శాసన సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇదేం రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
Harish Rao : అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు బంధు, యాదవులకు గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు నిలిపేశారన్నారు. హైడ్రా పేరుతో విధ్వంసం చేయడమే తప్ప, ఏడాది పాలనలో ఒక్క నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని…
అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ షాకులిస్తోందా? ఒకదానివెంట ఒకటిగా ఇంకా ఇవ్వడానికి స్కెచ్చేస్తోందా? ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఓ బలమైన వర్గం మీద ఫ్రష్‌గా ఫోకస్ పెట్టిందా? ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే.... ఏం జరుగుతుందో లోక్‌సభ ఎన్నికల్లో జ్ఞానోదయం అయిందా? ఇప్పుడు ఎక్కడ కొత్తగా ప్యాచ్ వర్క్ మొదలుపెట్టింది హస్తం పార్టీ? ఆ ఎఫెక్ట్ ప్రతిపక్షాల మీద ఎలా ఉండబోతోంది?
Damodara Raja Narasimha : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని దామోదర రాజనర్సింహ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నామని, మహిళా సాధికారత అనే అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా భుజస్కందాలపై వేసుకుందన్నారు మంత్రి దామోదర. ఇందిరా గాంధీ హయం లో పేదలకు భూములు పంచిన గంత కాంగ్రెస్ ది అని, గత 10సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక గుంట భూమి,ఒక ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. సింగరేణి కార్మికులకు కాపాడుకునే బాధ్యత…
MLC Kavitha : మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారని విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందన్నారు. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది… అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అంటూ కవి పేర్కొన్నారు. అలాంటి…
Boora Narsaiah Goud: తెలంగాణ ప్రగతి, ప్రతిష్ట తిరోగమనంలో పయనిస్తోందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ అంటే ఫాస్టెస్ట్ గగ్రోయింగ్ సిటీ అనే పేరు ఉండేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక 6 మోసాలు.. 66 అబద్ధాలు అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు బూర నర్సయ్య. గల్లీలో తిట్లు.. ఢిల్లీలో మెట్లు.. దేవుళ్లపై ఒట్లు.. సర్కార్ దీనికే పరిమితమైందని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదలు ఇప్పటి…