కేసీఆర్, జగన్ ఒప్పందంలో భాగంగానే ప్రస్తుతం ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బేసిన్‌లు లేవు భేషజాలు లేవు అన్న కేసీఆర్ మాటలను గుర్తు చేశారు. తాజాగా ప్రాజెక్టుల అంశంపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సీఎం మాట్లాడారు. గోదావరి జలాలు పెన్నాకు తీసుకెళ్తా అని చెప్పి.. ఏపీని ప్రోత్సహిస్తాం అని చెప్పింది కేసీఆర్ అని తెలిపారు.
కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయటికి వచ్చిందటే... పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆమె ఎయిర్‌పోర్టులో తన తండ్రికి రాసిన లేఖపై స్పందించారు. నేను కేసీఆర్ కు లేఖ ద్వారా వ్యక్త పర్చిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదని స్పష్టం చేశారు. లేఖ బహీర్గతం కావడం బాధాకరమన్నారు. లేఖ బహీర్గతం కావడం కాంగ్రెస్,…
అమెరికాకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. కవితకు సంబంధించిన ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. "టీం కవితక్క అంటూ" కటౌట్లు కనిపిస్తున్నాయి. కానీ.. ఈ బ్యానర్లలో ఎక్కడ కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కనిపించడం లేదు.
మైడియర్ డాడీ అంటూ రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసీఆర్ దేవుడని.. కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని వెల్లడించారు. తనకు పార్టీ, కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకులు సంబర పడొద్దని.. వాళ్లకు కోతికి కొబ్బరి చిప్పదొరికినట్లైందన్నారు.
తండ్రికి కూతురు రాసిన లేఖ బయటకి ఎలా వచ్చింది? అది కూడా రాసిన 20 రోజుల తర్వాత బయట పెట్టడం వెనక వ్యూహం ఏంటి? కేసీఆర్ విషయంలో కవిత కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం.. ఆయనకు ఇబ్బందికరమైన అంశాలు ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? అసలు లేఖను బయటపెట్టిన లీకు వీరులు ఎవరు?
కాళేశ్వరం కుంగుబాటుపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వికృత, వికార మైన విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.జ్యుడీషియల్ కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్ కు నోటీసులు పంపిస్తే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు..
Congress: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో, టీకాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో, బీసీ వర్గాలకు విద్య , ఉద్యోగ రంగాలలో మరింత న్యాయం చేకూరుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. Ajith :…
Minister Seethakka : ములుగు జిల్లా వెంకటాపూర్‌లో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కళ్లముందుంచుకుని పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు నిత్యం తోడుగా నిలబడే సంకల్పంతోనే ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం అందిస్తే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అసహనంతో రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. పేదల పట్ల ప్రభుత్వానికి…