Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Ghmc Elections Brs Plans Strong Strategy Bjp May Be Main Target In Hyderabad

Off The Record: GHMC ఎన్నికలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. ఈసారి బీజేపీని గట్టిగా టార్గెట్ చేయాలన్న లక్ష్యం..?

Published Date :March 2, 2026 , 8:00 pm
By Sudhakar Ravula
  • హైదరాబాద్‌ చుట్టుపక్కలే బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు..
  • ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల మీద స్పెషల్‌ ఫోకస్‌?..
  • గతంలో మజ్లిస్‌ పార్టీతో కలిసి మేయర్‌ పీఠం కైవసం..
  • ఈసారి బీజేపీని గట్టిగా టార్గెట్‌ చేయాలన్న లక్ష్యం..
  • ఎక్కువ సీట్లు కావాలంటే బీజేపీనే ఢీ కొట్టాలన్న వ్యూహం..
  • హైదరాబాద్‌ వరకు రివర్స్‌ గేమ్‌ ఆడాలనుకుంటున్నారా?..
  • ప్రస్తుతం 3 కార్పొరేషన్స్‌, 300 డివిజన్స్‌..
  • బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారానికి చెక్‌పెట్టే వ్యూహం..
  • బీజేపీని శత్రువుగా డిక్లేర్‌ చేస్తేనే ఎక్కువ సీట్లు వస్తాయన్న లెక్కలు..
Off The Record: GHMC ఎన్నికలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. ఈసారి బీజేపీని గట్టిగా టార్గెట్ చేయాలన్న లక్ష్యం..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Off The Record: తెలంగాణలో.. ఆ మాటకొస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్. ప్రస్తుతం ఇది గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్స్‌గా విడిపోయింది. అదంతా ఒక ఎత్తయితే… త్వరలో ఇక్కడ జరగబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు జాగ్రత్తగా పావులు కదుపుతున్నాయి. ఎలక్షన్‌ ఎప్పుడు జరుగుతుందన్న క్లారిటీ రాక ముందే…ఎవరి ప్లానింగ్‌లో వాళ్ళు ఉన్నారు. ఇక రూరల్‌ తెలంగాణ కంటే… హైదరాబాద్‌ చుట్టు పక్కలే తమకు ఎక్కువ అసెంబ్లీ సీట్లు రావడం, ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఇక్కడే సత్తా చాటడం లాంటి కారణాలతో.. జీహెచ్‌ఎంసీ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెడుతోందట బీఆర్ఎస్‌. 2020లో గ్రేటర్ ఎన్నికలు జరిగినప్పుడు నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అత్యధిక డివిజన్స్‌ గెలుచుకుంది. మొత్తం 150 డివిజన్లకు గాను బీఆర్ఎస్ 56 చోట్ల, బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక ఎంఐఎం ఖాతాలో 44 డివిజన్లు పడగా…. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండిటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌ మేయర్ పీఠానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 76 కాగా…, అప్పట్లో ఎంఐఎం మద్దతుతో గులాబీ అభ్యర్థి సీట్లో కూర్చున్నారు.

అయితే, అదంతా గతం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు దగ్గరైంది మజ్లిస్‌ పార్టీ. అందుకే… ఈసారి పూర్తిగా గేమ్‌ ప్లాన్‌ మార్చేయాలని అనుకుంటున్నారట బీఆర్‌ఎస్‌ పెద్దలు. కాంగ్రెస్‌, మజ్లిస్‌ దోస్తీ సంగతి ఎలాఉన్నా….కాషాయ పార్టీని గట్టిగా టార్గెట్‌ చేస్తేనే… తాము ఎక్కువ సీట్లు సాధించగలుగుతామని బీఆర్ఎస్‌ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అధికార పార్టీని కాకుండా… హైదరాబాద్‌ వరకు తమ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని డిక్లేర్‌ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ ప్రచారం చేసింది. కానీ హైదరాబాద్‌కు వచ్చేసరికి ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా…. రివర్స్ గేమ్‌ ఉంటుందని చెబుతున్నారు పార్టీ నాయకులు. గ్రామ స్థాయిలో కాషాయదళానికి పట్టు అంతంతమాత్రమేనన్నది విస్తృతాభిప్రాయం. కానీ… హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రభావం చూపగలుగుతుంది. అందుకే కమలాన్ని గట్టిగా టార్గెట్‌ చేస్తే… ఎక్కువ సీట్లు గెలవగలుగుతామన్నది గులాబీ ప్లాన్‌. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వల్ల రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదని, గతంలో గెలిచిన ఆ పార్టీ కార్పొరేటర్లు కూడా సొంతగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రచారం చేయాలనుకుంటున్నట్టు సమాచారం.

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

మొన్నటి వరకు 150 సీట్లు ఉన్న జీహెచ్ఎంసీ కాస్తా… ఇప్పుడు మూడు కార్పొరేషన్స్‌ అవడంతో… డివిజన్స్‌ సంఖ్య మూడు వందలకు పెరిగింది. దీంతో మెజారిటీ సీట్లు సాధించాలని కారు నేతలు టార్గెట్‌ పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని ప్రచారం చేస్తూ వస్తోంది కాంగ్రెస్. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత కూడా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులుంటాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి వాదనలన్నిటినీ కొట్టిపడేయాలంటే…. హైదరాబాద్‌ ఎన్నికలను అవకాశంగా మల్చుకోవాలని చూస్తోందట బీఆర్‌ఎస్‌. హైదరాబాద్‌లో బీజేపీని ప్రధాన శత్రువుగా భావించి టార్గెట్‌ చేస్తే…. ఇటు తమకు ఎక్కువ సీట్లు రావడంతోపాటు… అటు రెండు పార్టీలు ఒకటేనన్న విమర్శల్ని ఏకకాలంలో తిప్పికొట్టవచ్చన్నది గులాబీ ప్లానింగ్‌ అట. ఇలాగే ముందుకు వెళ్తే మరో రెండున్నర ఏళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉపయోగపడుతుందన్న లెక్కలు కూడా ఉన్నాయట. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కూడా లైట్ తీసుకోకుండా దానితోపాటు… నగరంలో బలంగా ఉన్న బీజేపీని టార్గెట్‌ చేస్తే… సింగిల్‌ అటెంప్ట్‌లో బహుళ రాజకీయ ప్రయోజనాలు చేకూరతాయన్నది కారు పార్టీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AIMIM role GHMC
  • BJP vs BRS Telangana
  • BRS election planning
  • BRS strategy Hyderabad
  • GHMC 2026 updates

తాజావార్తలు

  • Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్

  • CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ

  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..

  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన

  • Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions