Jubilee Hills Byelection Results: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు పలు డివిజన్ బాధ్యలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రులు మంత్రుల పెర్ఫార్మెన్స్ గురించి చూద్దాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహమత్ నగర్లో పూర్తి మెజార్టీ తెచ్చిపెట్టారు.
Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. 101 పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.. అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కాగా.. ఇందులోనూ హస్తం పార్టీ మెజారిటీ కనబరిచింది. తొలి రౌండ్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం లభించింది.. 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్లో కాంగ్రెస్‌కు 8,926 ఓట్లు, బీఆర్ఎస్ 8,864 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లోనూ కాంగ్రెస్ పార్టీ 9,691 ఓట్లు…
Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా యూసుఫ్‌గూడలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రకాష్ భాకర్.. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడారు. మా అభ్యర్థి యువకుడు, స్థానికుడు, ఉత్సాహవంతుడు అని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసినవారిని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం…
Harish Rao Father Death: బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతితో హరీశ్ రావు కుటుంబంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం…
Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపు (గురువారం) యథావిధిగా నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా పడినప్పటికీ, ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ మాత్రం ఆటంకం లేకుండా ముందుకు సాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారించింది. విచారణ సందర్భంగా సుదీర్ఘ వాదనలు…
Kaleshwaram Report: శాసన సభలో కాళేశ్వరం కమిషన్‌పై చర్చ మొదలైంది. ఈసందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 650 పేజీల పుస్తకం ఇచ్చి అరగంట మాట్లాడాలి అంటే ఎలా అని ప్రశ్నించారు. వరదలు, యూరియా కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలపై చర్చిద్దామని బీఏసీలో కోరామని, వరద సమస్య ముఖ్యం కాదని ప్రభుత్వం అనుకుందని చెప్పారు. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ…