Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malkajgiri: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరులో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో ఈ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. తాజాగా ఈ దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరారీలో నేపాలీ గ్యాంగ్‌ను ఎట్టకేలకు పట్టుకున్నారు. గత నెల 12వ తేదీన రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన మమత, రాజేశ్ అనే పనివాళ్లు తమ సహచరులతో కలిసి దోపిడీకి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. ఇంట్లో పనికి చేరిన కేవలం 13 రోజులకే వారు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ప్రణాళికతో దోపిడీకి దిగిన నిందితులు మురళీధర్ మోహన్‌కు మత్తుమందు ఇచ్చి, ఆయన భార్య విజయలక్ష్మిని బెదిరించి నగదు, విలువైన వస్తువులు దోచుకుని పరారయ్యారు. అనంతరం నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు వారి జాడను గుర్తించారు. ఈ దోపిడీకి రాజేశ్, మమతలతో పాటు సబీనా, చాంగ్, సామ్రాట్, బిశ్వాల్, కమల్, శంకర్ తదితరులు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా గత నెల 16న సునిత, బిశ్వాల్, కమల్ బహదూర్, శంకర్లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. తాజాగా పరారీలో ఉన్న మరో నలుగురు ప్రధాన నిందితులను సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీకి సంబంధించిన ఆస్తుల స్వాధీనం, ముఠా కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇక ఈ కేసుపై మల్కాజ్గిరి సీపీ సుమతి వివరణ ఇచ్చారు. “రిటైర్డ్ ఇంట్లో ఏప్రిల్ 25 న ప్రొఫెసర్ ఇంట్లో నేపాల్‌కు చెందిన మీనా, సబీనాను పనిమనిషిగా పెట్టిస్తుంది. సబీనా భర్తగా రాజేష్‌ను ప్రొఫెసర్‌కు పరిచయం చేసింది. ఆ తర్వాత ఎంతో నమ్మకంగా విశ్వాసంగా పనిచేశారు. అంత నమ్మకాన్ని యజమానులకు, విదేశాలలో ఉన్న వారి పిల్లలకు నిందితులు కలిగించారు. గత నెల 11 న మీనా బర్త్ డే పేరుతో దోపిడీకి ప్లాన్ చేసి అమలు చేశారు. ప్రొఫెసర్ ఇంట్లో మొత్తం ఏడుగురు కలిసి దోపిడీకి పాల్పడ్డారు. దోపిడి చేసిన తరువాత ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. సరిహద్దు వద్ద పెద్ద పెద్ద చిత్రాలను అతికించాము. బోర్డర్ లో తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితులను తెచ్చాం. నేపాల్‌కు వెళ్ళేందుకు నలుగురు నిందితులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలోనే నిందితులను పట్టుకున్నాం. మీనా, రాజేశ్ లు నేపాల్‌కు చెందిన వారు. మమ్మల్ని తల్లిదండ్రులుగా చూస్తున్నామని నిందితులు తరుచూ మురళీధర్, విజయలక్ష్మీలకు మీనా, రాజేశ్‌లు చెప్పేవారు. అదే విషయాన్ని దోపిడీ సమయంలో నిందితులతో విజయలక్ష్మి అనింది. చాలా బాగా చూసుకున్నాము మిమ్మల్ని, మమ్మల్ని చంప్పొద్దని విజయలక్ష్మి కోరింది. ఇప్పటి వరకు 39 వేల 640 మందికి పైగా సురక్ష యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. మీనా పై 2023లో మొయినాబాద్ పీఎస్‌లో ఇప్పటికే నిందితురాలిగా ఉంది.” అని సీపీ వెల్లడించారు.
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
- Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
తాజావార్తలు
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?