Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- నకిలీ ట్రక్ షీట్లతో రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల గోల్మాల్
- గోదాం మేనేజర్, సూపర్వైజర్ సహా ఆరుగురు అరెస్ట్
- రూ.14 లక్షల నగదు స్వాధీనం.. రూ.46 లక్షల ఖాతాలు ఫ్రీజ్
- రైస్ మిల్లుల పాత్రపై లోతైన దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sircilla Paddy Scam: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జరిగిన ఒక భారీ కుంభకోణాన్ని జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నకిలీ రికార్డులతో ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్న ఒక అంతర్ జిల్లా ముఠా గుట్టును రట్టు చేసి, అందులోని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మీడియాకు వెల్లడించారు.
రూ. 91 లక్షల ప్రభుత్వ నిధుల మాయం
నిందితులు నకిలీ ట్రక్ షీట్లను సృష్టించి, వాటిని సివిల్ సప్లైస్ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ విధంగా తప్పుడు రికార్డులను చూపిస్తూ సుమారు రూ. 91 లక్షల ప్రభుత్వ సొమ్మును కాజేశారు. అంతేకాకుండా, కొనుగోలు కేంద్రాల నుండి గోదాంకు వచ్చిన ధాన్యాన్ని కేవలం రికార్డుల్లో మాత్రమే చూపిస్తూ, వాస్తవానికి ఆ ధాన్యాన్ని ప్రైవేట్ రైస్ మిల్లులకు అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
ప్రధాన సూత్రధారులు , నిందితుల అరెస్ట్
ఈ భారీ స్కామ్లో పెద్దూర్ అపెరల్ పార్క్ గోదాం మేనేజర్ ఉత్కం విజయ్, అలాగే సూపర్వైజర్ వాసాల గణేష్ ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు ఈ అంతర్ జిల్లా ముఠాకు చెందిన మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నగదు స్వాధీనం.. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
నిందితుల నుండి పోలీసులు రూ. 14 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 46 లక్షల నిధులను ఏజెన్సీలు ఫ్రీజ్ చేశాయి. మిగిలిన రికవరీ కోసం , అక్రమ ఆస్తుల వివరాల కోసం పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
సివిల్ సప్లై మేనేజర్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో, అలాగే రైస్ మిల్లుల యజమానుల పాత్రపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!