Pawan Kalyan: ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- జనసేన సభకు అనుమతి నిరాకరణ
- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Press Meet: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ పోలీసుల అనుమతుల వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పవన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించనున్న మీడియా సమావేశానికి అయినా అనుమతి ఇస్తారా లేదా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో మంగళవారం సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటానని తెలిపారు. ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు అయినా తెలంగాణ పోలీసు శాఖ అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నానంటూ పవన్ సెటైరికల్ కామెంట్ చేశారు. ‘ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా? లేదా? చూద్దాం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
రాయదుర్గంలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో జూన్ 2న నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల నిర్ణయం అనంతరం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సభకు అనుమతి నిరాకరణపై జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. పవన్ నిర్వహించనున్న మీడియా సమావేశంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!