తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా నేటితో (నవంబర్ 29) మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. తొలి రోజే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు సర్పంచి పదవుల కోసం 3,242 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల…
తెలంగాణలో జరుగుతున్న రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి మాజీ మావోయిస్టు నేత జ్యోతి బరిలోకి దిగుతున్నారు. మావోయిస్టు పార్టీలో 19 సంవత్సరాలుగా పనిచేసి ప్రజా సమస్యల పోరాటానికి కృషి చేశానని, 2023 సంవత్సరంలో సంవత్సరంలో లొంగిపోయిన అనంతరం, గ్రామంలో ప్రజల సమస్యలపై దృష్టి సాధించినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం లొంగి పోయిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి సర్పంచిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శివంగలపల్లికి చెందిన నేరెళ్ల…
తెలంగాణలో గత కొంత కాలంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఎన్నికలకు సంబంధించిన తొలి దశ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే పలు గ్రామాల్లో…
TG Local Body Elections: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను…
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే… ఆ గ్రామాభివ్రుద్ది కోసం ప్రత్యేకంగా రూ.10 లక్షల నిధులను అందజేస్తానని కేంద్ర మంత్రి ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివ్రుద్ధి వైపు ద్రుష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని…
Telangana Local body Elections Schedule: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికలకు సంబంధించిన కీలక వివరాలను తెలియజేశారు. ఈ ఎన్నికలు మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11, రెండో విడత డిసెంబర్ 14, మూడో విడత డిసెంబర్ 17 తేదీల్లో జరుగనున్నాయి.ఈ…
Story Board: తెలంగాణ సర్కార్… పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో…కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చింది. ఇదే ఊపులో పంచాయతీ ఎన్నికలను నిర్వహించి…రాష్ట్రవ్యాప్తంగా పార్టీబలంగా పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీలకు పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో మరో వారం లేదంటే పది రోజుల్లో…
Sarpanch Eligibility: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ (EC). గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని సోమవారం విడుదల చేశారు. తొలుత మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరం మొత్తం ఐదు దశల్లో జరగనుంది. మండల, జిల్లా పరిషత్‌ల తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 23న, రెండో విడత అదే నెల 27న జరగనున్నాయి. గ్రామ పంచాయతీల…
Panchayat Elections : తెలంగాణ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల నిర్వహణపై తర్జనభర్జనలో ఉంది. డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2 లోపు ఈ నివేదిక సమర్పించబడుతుందని కమిషన్ హామీ ఇచ్చింది. నివేదిక అందిన వెంటనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరిలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం…