Telangana Local body Elections Schedule: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికలకు సంబంధించిన కీలక వివరాలను తెలియజేశారు. ఈ ఎన్నికలు మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11, రెండో విడత డిసెంబర్ 14, మూడో విడత డిసెంబర్ 17 తేదీల్లో జరుగనున్నాయి.ఈ ఎన్నికలతో సంబంధం ఉన్న అన్ని వివరాలు, ఓటర్ల జాబితాలు సహా సమగ్ర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయని కమిషనర్ తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వచ్చింది.
Mythri Movie Makers : “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” ను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీస్
ఈ ఎన్నికలు సంబంధించి నామినేషన్ దాఖలు తేదీలు కూడా విడతల వారీగా ప్రకటించారు. మొదటి విడత నామినేషన్లు నవంబర్ 27 నుండి ప్రారంభం కానున్నాయి. రెండో విడత నామినేషన్లు నవంబర్ 30 నుండి, మూడో విడత నామినేషన్లు డిసెంబర్ 3 నుండి స్వీకరించబడతాయి. ఒక విడత పోలింగ్ నుండి మరో విడత పోలింగ్ వరకు రెండు రోజుల వ్యవధి ఉంటుందని కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు. మొదటి విడతలో మొత్తం 189 మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం కోటి 66 లక్షల 55 వేల గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
IND vs SA 2nd Test: ముగిసిన నాల్గవ రోజు ఆట.. టీమిండియా విజయానికి ఎన్ని పరుగులు అవసరమంటే..?
ఇంతకుముందు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయని, సెప్టెంబర్ 29న విడుదల చేసిన షెడ్యూల్‌ను అక్టోబర్ 9న నిలిపివేశామని కమిషనర్ గుర్తుచేశారు. అన్ని ఇబ్బందులను అధిగమించి ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.