సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో అన్ని సమస్యల పరిష్కారాలపై చర్చించినట్లు తెలిపింది. మంత్రి హామీతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, మంత్రి హామీతో సమ్మె తాత్కాలికంగా విరమించుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్ లో సమ్మె తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి దశల వారీగా పరిష్కారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
Alert.. Alert: తెలంగాణ ప్రజలు పగటి పూట పనుల మీదూ, పండుగ పూట ఊరెళ్లాలనే ప్రణాళికలలో బిజీగా ఉన్న ఈ సమయంలో… ఒక్కసారిగా ఒక బిగ్ అలర్ట్ వచ్చింది. “బస్సులు బంద్!”.. అవును, ఈ అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా RTC బస్సులు ఆగిపోనున్నాయి. జనజీవనం స్తంభించనున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌కి ఇది భలే ఛాన్స్… రెట్లు రేట్లతో డబ్బు దండుకునే సమయం వచ్చేసింది. గతంలో ఎన్నోసారి చూసిన దృశ్యం మళ్లీ రిపీట్ కానుంది. ప్రయాణికుల…
11వేల కోట్ల స్కాం జరిగింది: కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలం నుండి సంక్షేమ పథకాలు అమలు చెయ్యకుండా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద బురద జల్లి కాలం గడిపేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో దాదాపు 11వేల కోట్ల స్కాం జరిగిందని, ప్రభుత్వ ఖజానాపై ఎంతో భారం పడుతుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. అధికారంలోకి…
వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప అని విమర్శించారు. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి…
పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లా ప్రాంతానికి చెందిన డి.పవన్‌కుమార్ (37) తన స్నేహితుడు సందీప్ తో కలిసి గత ఐదేళ్ళుగా హైదరాబాద్ మధురానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పవన్‌కుమార్ ప్రైవేటుసంస్థలో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యం కారణంగా వెళ్ళడం లేదు. ప్రతిరోజు ఆసుపత్రికి స్నేహితునితో కలిసి వెళ్ళి వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా…
రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే 2 నుంచి 9వ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మే 3న తెలుగు, మే 4న ఇంగ్లిష్ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఇక మే 5 నుంచి 9వ వరకు మెయిన్స్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. మొత్తం 89 పోస్టులకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 4496 అభ్యర్ధులు…
ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే…
Niranjan Reddy : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిపై ప్రత్యేకంగా మండిపడ్డారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం మాతృద్రోహం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంగా తట్టెడు మన్ను కూడా…
కూటమి నేతల మధ్య విభేదాలు.. చెక్ పెట్టే పనిలో పెద్దలు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఏర్పడిన విభేదాలకు చెక్ పెట్టే పనిలో ఇరు పార్టీల పెద్దలు రంగంలో దిగినట్టు తెలుస్తోంది. విజయవాడలో తాడేపల్లిగూడెంకు చెందిన టీడీపీ ఇంచార్జి వలవల బాబ్జి, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లతో సమన్వయ కమిటీ భేటీ నిర్వహించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ…