VC Sajjanar : సోషల్ మీడియా పిచ్చికి హద్దులుండాలి.. ఆర్టీసీ సిబ్బందిని ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు
- ఇన్ఫ్లుయెన్సర్ల ప్రవర్తనపై సజ్జనార్ ఆగ్రహం
- ఆర్టీసీ సిబ్బందికి ఇబ్బంది కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు
- సామాజిక మాధ్యమాల పాపులారిటీ కోసం వెర్రి ప్రయత్నాలు మానుకోండి : వీసీ సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar : టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన పేర్కొంటూ, “ఇదేం వెర్రి కామెడీ!? సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!?” అని తీవ్రంగా ప్రశ్నించారు.
IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త రూల్.. ఆ ప్లేయర్స్ ఈ సీజన్ వరకే!
Also Read
కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ వీడియోల కోసం ఆర్టీసీ బస్సుల్లో లేదా డిపోల్లో సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వీసీ సజ్జనార్ ఈ తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు.
ఆర్టీసీ ఒక ప్రజా రవాణా సంస్థ అని, ఉద్యోగులు నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటారని సజ్జనార్ గుర్తు చేశారు. వారి విధులకు ఆటంకం కలిగించడం సరికాదని, ఇలాంటి చర్యలను సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం దిగజారే ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కూడా దృష్టి సారించే అవకాశం ఉంది.
Lokesh: వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్
ఇదేం వెర్రి కామెడీ!?
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!?
కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం… pic.twitter.com/OBXeqmCZRp
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 15, 2025
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!