Narendra Modi : హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్ చౌక్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రధాన్ మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకోగా, మంటల ప్రభావంతో మూడుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు.
Mirchowk Fire Accident : హృదయవిదాకరం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. మృతుల్లో 8 మంది చిన్నారులు
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరిన్ని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య 17కి చేరుకుంది. ఇంకా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు వృద్ధులు (60 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు) , ఐదుగురు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒకేసారి అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటన నేపథ్యంలో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
S*xual Assault: ఐదేళ్ల మేనకోడలిపై మైనర్ మామ అత్యాచారం.. చివరకు.?