ఎమ్మెల్సీ పదవికి జకియా ఖానం రాజీనామా: వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను ఛైర్మన్‌కు పంపారు. గత కొంత కాలంగా ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జకియా ఖానం రాజీనామాను ఆమోదిస్తే.. డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా పోతుంది. జకియా ఖానం స్వస్థలం…
నేడు కల్లితండాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లనున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి.. 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాలను…
Blast : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి మావోయిస్టుల ఉనికిని గుర్తుచేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడులో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే, మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు, భద్రతా దళాలు తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో మావోయిస్టుల తాకిడి ఎదురవ్వగా, ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి.…
HYDRA : భారతదేశంలో అనేక మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల అట్టడుగు లోతు కల్పించేవి వంటి సమస్యలపై దృష్టి సారిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ క్రమంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అమలులోకి తీసుకురావడమనే నిర్ణయం తీసుకుంది. నేటి నుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరంలోని బుద్ధభవన్ పక్కనే నిర్మితమైన ఈ హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్…
CM Revanth Reddy : ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొనాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మే 8 గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొనాలని ఆయన కోరారు. ఇక బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సివిల్ మాక్‌డ్రిల్…
ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన భారత ఆర్మీ.. పాక్ పై మెరుపుదాడులు.. భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ఇప్పటి వరకు భారత ఆర్మీ ధ్వంసం…
ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పన్నెండు న్నరేళ్ల కిందట కోర్టు మెట్లేక్కినట్లు చెప్పారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్ల ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకమైన బాధ ఆరోజు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అనుభవించానన్నారు.
ఏప్రిల్ 7, 8 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వల్ల 83 మంది బాధితులు ఆస్పత్రి పాలయ్యారని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. ఆల్ఫాజోలం కలిపినా కల్లు తాగడం వల్ల అస్వస్థత లోనయ్యారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీజీఎన్ఏబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కల్తీ కల్లుపై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావించినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాల కోసం 26 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, పాకిస్థాన్ పాలకులు కలవర పాటుకు గురవుతున్నారు. యుద్ధం వచ్చేసిందని, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గంటలు ఘడియలతో సహా యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పేస్తున్నారు. ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణ్వాయుధాలు తమ వద్ద మాత్రమే ఉన్నట్లు ప్రగల్బాలు పోతున్నారు. నిజానికి, భారత దేశం వద్ద పాక్ కంటే శక్తివంతమైన యుధాలు ఉన్నాయి. ఒక్క అణ్వాయుధాలే…