Mirchowk Fire Accident : హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్‌చౌక్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం మరింత విషాదాన్ని నింపింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరుకుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉండటం హృదయాలను కలిచివేస్తోంది. మృతి చెందిన చిన్నారుల్లో ఒకటిన్నర సంవత్సరం వయస్సున్న ఒకరు, ఏడేళ్ల వయస్సున్న మరొకరు ఉన్నారు. మిగిలిన ఆరుగురు పిల్లలు నాలుగు సంవత్సరాల లోపు వారే కావడం ఈ దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. అంతేకాకుండా, ఈ ప్రమాదంలో నలుగురు వృద్ధులు (60 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు ) , ఐదుగురు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒకేసారి అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
Fire Accident : మీర్ చౌక్ భారీ అగ్నిప్రమాదంలో 11కి చేరిన మృతుల సంఖ్య
నిన్న జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మంటలు వేగంగా వ్యాపించడం , భవనంలో చిక్కుకున్న వారిని వెంటనే బయటకు తీయలేకపోవడం వల్ల మృతుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేయగా, మృతదేహాలను వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు, బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ దుర్ఘటన జరిగిన తీరు , దానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Virat Kohli-Bharat Ratna: కోహ్లీకి ‘భారతరత్న’ ఇవ్వాలి .. రిటైర్మెంట్ మ్యాచ్ నిర్వహించాల్సిందే..!