Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కిరాతకంగా జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి బదిలీ చేసింది సుప్రీం కోర్టు. 2021 ఫిబ్రవరి 17న గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణిల హత్య జరిగింది. పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు దంపతులను అడ్డుకొని నడిరోడ్డుపై హత్య చేశారు. అయితే వామనరావు దంపతుల హత్య కేసు అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తన కొడుకు , కోడలు హత్య కేసును సీబీఐకి బదిలీ చెయ్యాలని వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదులు మేనకా గురుస్వామి, చంద్రకాంత్ రెడ్డి లు వామనరావు తరపున వాదనలు వినిపించారు. వామనరావు కేసును సీబీఐకి ఇస్తే తమకేం అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. మరోవైపు చనిపోవడానికి ముందు వామన రావు మాట్లాడిన మాటలు అసలువేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది.
READ MORE: Medical College Scam: ఘరానా మోసం.. మెడికల్ కళాశాలలో ఉద్యోగం దొరకిందని సంబరపడ్డ ఉద్యోగులు.. చివరకు?
వామనరావు హత్య కేసులో పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో పుట్ట మధు పేరు కూడా వినిపించింది. అయితే గత ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న మధును ఇప్పటి సర్కార్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్టు జస్టీస్ ఎం ఎం సుంధరేష్ ధర్మాసనం వామనరావు హత్య కేసును సీబీఐకి బదిలీ చేసింది.
READ MORE: Off The Record: ఎంపీల మీటింగ్లో ట్విస్టులు ఉన్నాయా..?