POCSO: చిన్నారుల జీవితాలను మొగ్గలోనే చిదిమేస్తున్నారు కామాందులు. ఆభం శుభం తెలియని వారి ప్రాణాలను.. కొందరు మృగాళ్లు తమ కామవాంఛ కోసం గాల్లో కలిపేస్తున్నారు. ఇలాగే కామంతో కళ్లు మూసుకుపోయి ఓ చిన్నారిని చిదిమేసిన మానవ మృగానికి ఉరిశిక్ష విధించింది నల్లగొండ జిల్లా ఫోక్సో కోర్టు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత దారుణంగా హత్య చేసిన మానవ మృగానికి.. నల్లగొండ జిల్లా ఫోక్సో కోర్టు ఉరి శిక్ష విధించింది. అంతే కాదు దోషికి రెండు ఉరి శిక్షలు విధించిన కోర్టు.. లక్షా పది వేల రూపాయల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఫోక్సో కోర్టు ఆదేశించింది. నిందితుడు చెల్లించే జరిమానా కూడా భాదిత కుటుంబానికే ఇవ్వాలని కొర్టు తన తుది తీర్పులో వెల్లడించింది.
READ MORE: Youth Awardees Meet President: రాష్ట్రపతిని కలిసిన యువజన అవార్డు గ్రహీతలు..
2013 ఏప్రిల్ 28న నల్లగొండలోని మాన్యంచెల్క హైదర్ ఖాన్ గూడలో దారుణ ఘటన జరిగింది. మహమ్మద్ ముక్రం అనే నీచుడు…. అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక ఇస్మత్ ఉన్నీసాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 6వ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల ఇస్మత్ ఉన్నీసా… వేసవి సెలవులు కావడంతో.. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఇంటింటికి తిరిగి టీ పొడి అమ్మేది. ఇందులో బాగంగా నిందితుడి ఇంటికి కూడా పలుమార్లు టీ పొడి ఇచ్చేందుకు వెళ్లింది. దీంతో ఆమెపై కన్నేశాడు దుర్మార్గుడు మహామ్మద్ ముక్రం. మైనర్ బాలికను ఇంట్లోకి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చున్నీతో ఉరి వేసి చంపి.. మృతదేహాన్ని తన ఇంటికి సమీపంలో ఉన్న నాలాలో పడేశాడు.
READ MORE: MLC Kavitha: రేపు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కు కవిత.. ఎందుకో తెలుసా..?
ఇంటి నుంచి సాయంత్రం టీ పొడి అమ్మడానికి వెళ్లిన ఇస్మత్ ఉన్నీసా రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడం… స్నేహితుల ఇళ్లలో, బంధువుల ఇళ్లలో వెతికి చూశారు కుటుంబ సభ్యులు. ఏప్రిల్ 28న రాత్రి నల్లగొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. టీ పొడి అమ్మడానికి ఎవరెవరి ఇంటికి వెళ్లిందో ఆరా తీశారు. ఓ ఇంట్లో ఆరా తీయగా ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం, డాగ్ స్క్వాడ్ ఆ ఇంటి వద్దే ఆగిపోవడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేశారు. అదే ఇంటి సమీపంలో నాలాలో మైనర్ బాలిక డెడ్ బాడీ దొరికింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులకు.. మహామ్మద్ ముక్రం… మైనర్ బాలికను పలుమార్లు వేధించినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అతని ఇంటికి వెళ్లిన పోలీసులకు ముక్రం కనిపించకపోవడంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక టీంలు మహమ్మద్ ముక్రంను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై 302, 201 IPC సెక్షన్లతోపాటు POCSO చట్టం 2012లోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. మహమ్మద్ ముక్రం నేరం చేసినట్లు తేల్చింది. సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారం చేసినందుకు ఒక ఉరి శిక్ష, హత్య చేసినందుకు మరో ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కేసులో తీర్పు ఆలస్యం అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నా.. నిందితుడికి ఉరి శిక్ష విధించడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది..