High Court : ఐఏఎస్‌లకు దక్కని ఊరట.. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలన్న హైకోర్టు
- కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తాం
- రిపోర్ట్ చేయకుండా ఏమీ చేయలేం
- ప్రజాసేవ కోసమే ఐఏఎస్‌లు
- ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్లాలి : హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యాట్ తీర్పుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను నిర్ధారించలేమని స్పష్టం చేస్తూ, ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనర్థకమని హైకోర్టు పేర్కొంది. ఐఏఎస్ అధికారుల బదిలీపై స్టే ఇవ్వడం జరగదని, సంబంధిత వ్యక్తులు ముందుగా అక్కడ వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలని, కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. రిపోర్ట్ చేయకుండా ఏమీ చేయలేమని, ప్రజాసేవ కోసమే ఐఏఎస్‌లు అని, ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్లాలని హైకోర్టు తెలిపింది. ట్రిబ్యునల్ కొట్టేస్తే కోర్టులకు రావడం కరెక్ట్ కాదని, మీ వాదనలు వింటాం.. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Sanju Samson: మనసులో మాట బయటపెట్టిన శాంసన్.. అంత ఈజీ కాదేమో!
Also Read
అయితే.. ఇటీవల, డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులు, రొనాల్డ్ రోస్, సృజన, శివశంకర్, హరికిరణ్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్ వంటి వారు హైకోర్టుకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వద్ద తమ బదిలీని నిలిపివేయాలని కోరగా, అక్కడ వారు నిరాకరించడంతో, తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు విచారణ చేపట్టింది.
ఐఏఎస్ ల తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. క్యాట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తున్నామని, క్యాట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని హై కోర్ట్ కోరిందన్నారు. ఆర్డర్ కాపీ ఇంకా రాలేదని కోర్ట్ కు తెలిపామని, ఐఏఎస్ పిటిషన్ లను క్యాట్ అడ్మిట్ చేసుకుంది అని ఆయన తెలిపారు. క్యాట్ తదుపరి విచారణ నవంబర్ 4 కు వాయిదా వేసిందని ఐఏఎస్ కౌన్సిల్ తెలిపారు. అప్పటి వరకు ఐఏఎస్ లను రిలీవ్ చేయకుండా ఉండలే ఆదేశాలు ఇవ్వాలని ఐఏఎస్ కౌన్సిల్ కోరింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!