కేసీఆర్ అబద్ధాల గురించి ఎన్ని చెప్పినా తక్కువేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ప్రజావ్యతిరేక నరహంతక తెరాస ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని ఆదిలాబాద్ జిల్లాలోని గిమ్మ గ్రామంలో ఆయన వ్యాఖ్యానించారు.
విద్యుత్ రంగాన్ని ప్రవేటుపరం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఎందుకు కేంద్రం దొడ్డి దారిన గెజిట్లను విడుదల చేస్తోందని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ, విద్యుత్ ప్రసారానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అంతరాయం ఉండదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బుధవారం విద్యుత్ సౌధలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా సరఫరా అందించిన ఘనత తెలంగాణా విద్యుత్ సంస్థలకే దక్కిందని…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. కాగా.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. గత సోమవారం నుంచి నేటి వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో, మరో మూడు రోజుల పాటు సెలవులను పొడిగించారు. బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. read also: Thank You…