తెలంగాణ రాష్ట్రంలో ఎందుకో కొత్త జబ్బు వచ్చిందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కంటి చూపు జబ్బు వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది. రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక సంస్థ త్వరలో 4,661 స్టాఫ్ నర్సుల నియామక ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 31లోపు ఈ నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో భూములు, భూరికార్డులు కీలకమైనవని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని.. అధికారులు రికార్డులు సరిగా లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిస్సింగ్ లింక్స్ ప్రాజెక్ట్స్ (ఫేజ్-III) కింద రూ.2,410 కోట్లతో 104 లింక్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది.
నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ 3 లేఖలు రాశారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని లేఖలో పేర్కొన్నారు.