Telangana Cabinet: సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్నది. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్ ఈ విధంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 16 వ తేదీన… రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలి. సెప్టెంబర్ 17 – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు.
Read Also: Postpone: వారం వెనక్కి వెళ్ళిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’!
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు , మున్సిపాలిటి, పంచాయితీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 17 మధ్యాహ్నం బంజారా ఆదివాసీ భవన్ ల ప్రారంభోత్సవం. నక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు.
ఈ సభకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 18 – అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయాలి. కవులు కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా తెలంగాణ స్పూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.16,17,18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు.. ప్రారంభవేడుకల్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం.. 2023 సెప్టెంబర్ 17,18,19 తేదీల్లో ముగింపు వేడుకలు వుంటాయి.
Read Also: DH Srinivas : కుని ఆపరేషన్ల ఘటనపై విచారణ దొంగ చేతికే తాళాలిచ్చినట్టుందా..!
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!