Staff Nurse Recruitment: అతిత్వరలో 4,661 నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Staff Nurse Recruitment: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది. రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక సంస్థ త్వరలో 4,661 స్టాఫ్ నర్సుల నియామక ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 31లోపు ఈ నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్ధులు సన్నద్ధమవడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఇచ్చే అవకాశం ఉంది. పరీక్షలో వచ్చిన మార్కులు, వెయిటేజీ మార్కులను జోడించి, తుది అర్హులను ఎంపిక చేయనున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియను విజయవంతంగా ముగించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టింది.
టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి ఏవైతే.. నిబంధనలను పాటిస్తుందో.. అదే విధానాన్ని స్టాఫ్ నర్సుల నియామకాల్లోనూ అనుసరించాలని వైద్యశాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థను ఆదేశించింది. ఈ మేరకు నర్సుల పోస్టుల భర్తీకి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులకు రెండు నెలలు సమయం కూడా ఇస్తారు. బహుళ ఐచ్ఛిక సమాధానాల రూపంలో ప్రశ్నపత్రం రూపకల్పనకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమిస్తారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
T Congress: టీ-కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. నేడు హైదరాబాద్‌కు దిగ్విజయ్
ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన పని చేస్తున్న స్టాఫ్ నర్సులకు ఓ శుభవార్త ఉంది. ఇప్పుడు పని చేస్తున్నా.. గతంలో పని చేసినా.. అదనపు మార్కులు ఉండనున్నాయి. అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా గరిష్ఠంగా 80 పాయింట్లు వస్తాయి. ఇక మిగిలిన 20 పాయింట్లను ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిగా పనిచేసిన వారికి వెయిటేజీగా ఇస్తారు. ఈ కేటగిరీ అభ్యర్థులు అనుభవ ధ్రువపత్రం కోసం సంబంధిత ఉన్నతాధికారికా దరఖాస్తు చేయాలి. ఆ ధ్రువపత్రాన్ని అభ్యర్థులు ఇతర సర్టిఫికెట్లతో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇస్తారు. ఇక్కడ 6 నెలలు పూర్తయితేనే వెయిటేజీకి అర్హులుగా పరిగణిస్తారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, హాజరు రిజిస్టర్ల కాపీలను జతపరచాలి. వీరు ఆసుపత్రుల బాధ్యుల నుంచి అనుభవ ధ్రువీకరణను పొందాల్సి ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులందరూ తప్పక తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!