రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయి పేట గ్రామంలోని ఇటీవల టీఆరెస్ నాయకుల దాడి ఘటనలో గాయపడ్డ దళిత కూలీ బొడ్డు భూమయ్యను పరామర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ నాయకులు. దళితులపై, సమాన్యులపై దాడులు చేయడానికి టీఆర్ఎస్ లీడర్లకి ప్రభుత్వం లైసెన్స్ లు ఇచ్చింది అన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల దళితులపై దాడులు జరిగిన ముఖ్యమంత్రి మాత్రం స్పందించలేదు. తెలంగాణ రాష్ట్రం లో దళితులపై దాడులు ఆనవాయితీగా మారాయి.. తెలంగాణ…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం మళ్లీ రాజుకుంటుంది… ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది.. తాజాగా.. పర్యావరణ అనుమతులు లేకుండానే కృష్ణనదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది తెలంగాణ సర్కార్.. 14.12.2020 నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేని కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని ఇచ్చిన ఆర్డర్ను భేఖాతర్ చేస్తుందని కేఆర్ఎంబీకి రాసిన…
తెలంగాణ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతోందని..ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ 800 అడుగులు లోపు ఉంటే చుక్క నీరు తీసుకునే పరిస్థితి లేదని.. మాకు కేటాయింపులు ఉన్న నీటిని వాడుకోవటానికి ప్రాజెక్టులు కడుతుంటే అక్రమమని చెప్పటం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. కల్వకుర్తి, నట్టెం,పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు అన్నీ కేటాయింపులకు అదనంగా వాడుకోవటం కోసమే అన్నది వాస్తవం కాదా? కాల్వల వైడనింగ్ చేస్తున్నాం…అది కూడా తప్పంటే ఎలా? అని నిలదీశారు.…
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇవాళ్టితో స్కూళ్లకు వేసవి సెలవులు ముగియగా.. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కావాల్సిఉంది.. విద్యార్థులు స్కూళ్లకు రారు కానీ, ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరు కావాల్సి ఉంది.. కానీ, ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించింది.. అన్ని స్కూళ్లు, డైట్ కాలేజీలకు జూన్ 20వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్…
తెలంగాణ సర్కార్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణ భూముల అమ్మకంపై ఆర్థికమంత్రి హరీష్ రావు వాదన చాలా అసంబద్ధంగా ఉందని… గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. మరి, ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ఇప్పటి తెలంగాణలో ఈ భూముల అమ్మకాలు, వేలాలు ఏంటి? అని నిలదీశారు. అప్పుల పాలు చేసినం మన తెలంగాణ రాష్ట్రాన్ని… అని…
తెలంగాణ సర్కార్ పై వి. హనుమంత రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానాలకు కూడా స్థలం దొరకదని.. భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుందన్నారు. గత ప్రభుత్వాలు భూములన్ని అమ్మితే ఈ రోజు భూములు ఉండేవా అని ప్రశ్నించారు. అన్ని పార్టీ లు కలిసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. 2019 ఏప్రిల్ 12న జై భీం కార్యకర్తలు పంజాగుట్టలో అంబెడ్కర్ విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేశారని..మున్సిపల్ అధికారులు…
భూములు అమ్మాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. సమైక్య రాష్ట్రంలో భూముల కోల్పోయాం అనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో దోపిడీ జరిగింది.. నేను కూడా అలాగే చేస్తా అంటే ఎలా ? అని ప్రశ్నించారు. జనం నిన్ను కూడా అలాగే సాగనంపుతారని కెసిఆర్ ను హెచ్చరించారు. అప్పులు ఓ వైపు..భూముల అమ్మకం ఇంకో వైపు రాష్ట్రాన్ని దివాలా తియించడమే అని.. భూముల అమ్మకాన్ని నిలిపి వేయాలని భట్టి…
ఈటల రాజేందర్ ఎపిసోడ్ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ కరీంనగర్ అభివృద్దిపై ఫోకస్ చేసనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కరీంనగర్ లోయర్ మానేరు కింద చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికల పైన ఈరోజు హైదరాబాద్ నగరంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. మానేరు రివర్ ఫ్రంట్ ని దేశంలోని ఇతర ప్రాజెక్టుల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న ఇరిగేషన్,…
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత NVSS ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కల్తీ విత్తనాల అమ్మకం తెలంగాణ లో పతాక స్థాయిలో ఉందని NVSS ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ 7 ఏళ్లలో కనీసం ఏడుగురిపై కూడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. HMDA మాస్టరు ప్లాన్ కి భిన్నంగా 13 లింక్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని…టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల భూముల ధరలు పెంచేందుకు ఈ మార్పులు అని ఆరోపణలు చేశారు. HMDA పరిధిలోని ప్రతి ల్యాండ్ ట్రాన్సక్షన్ వెనుక కేటీఆర్ మిత్ర…
భూముల విక్రయానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. దీని కోసం కమిటీలు ఏర్పాటు చేసింది.. సీఎస్ సోమేష్ కుమార్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ, భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే, భూముల అమ్మకాలను పర్యవేక్షించేందుకు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.. నోడల్ శాఖ భూముల ధరను నిర్ణయించి.. ఈ వేలం ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈ వేలం ద్వారా పారదర్శకంగా…