ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి : గవర్నర్ తమిళిసై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి వీలుగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్‌రీచ్ బ్యూరో (ఆర్ఓబీ) కోవిడ్ జాగ్రత్తలు, వ్యాక్సినేషన్‌పై ఏర్పాటుచేసిన డిజిటల్ మొబైల్ వీడియో పబ్లిసిటీ వాహనాలను శనివారం ఆమె రాజభవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతకు ముందు ప్రజలలో కోవిడ్ టీకాపై ఉన్న సంశయం క్రమంగా తొలగిపోయి ప్రస్తుతం భారత్ 42 కోట్ల మందికిపైగా ప్రజలకు టీకా అందించి ప్రపంచంలోనే అత్యధిక మందికి టీకాలు అందించిన దేశాలలో ఒకటిగా అవతరించిందని అన్నారు.
టీకా తీసుకుని కరోనా వైరస్ పట్ల బాహుబలిగా మారాలన్న ప్రధానమంత్రి పిలుపును ప్రస్తావిస్తూ ఆయన సందేశాన్ని ఇంకా టీకా పట్ల సంశయాలు ఉన్న గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చేరవేయాలని ఆమె పిలుపునిచ్చారు. తాను స్వయంగా ఇటీవల ఒక గిరిజన ప్రాంతంలో కోవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న విషయాన్ని గవర్నరు గుర్తు చేశారు. కోవిడ్ టీకా ఆవశ్యకతపై ప్రధాని తరచుగా ఇస్తున్న సందేశాలు, 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ఉచిత టీకాలు అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరికీ చేరవేయాలని ఆమె అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
కోవిడ్ వ్యాక్సినేషన్‌పై సరైన సమయంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రీజనల్ ఔట్‌రీచ్ బ్యూరోను అభినందించిన గవర్నరు, ఆర్ఓబీ రూపొందించిన లఘు చిత్రాలు, క్రియేటివ్స్ ప్రజలలో టీకాలపై అవగాహన పెంచడానికి ఎంతో దోహద పడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?