Telangana: ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం
- కేటీఆర్ ఈ-ఫార్ములా రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం
- న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారన్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో రేపు ఏసీబీకి సీఎస్ లేఖ రాయనున్నారు. ఏసీబీకి వెంటనే లేఖ రాయాలని సీఎస్‌ను కేబినెట్ ఆదేశించింది. ఈ రేసింగ్ ఏజెన్సీ, నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ-ఫార్ములా రేసు కేసులో మంత్రి కేటీఆర్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు విచారించేందుకు రాష్ట్ర సర్కారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అనుమతి కోరుతూ లేఖ రాయగా.. గవర్నర్ ఆమోదం తెలిపారు. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. ఏసీబీ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఈ-ఫార్ములా కారు రేసు నిర్వహణకు సంబంధించిన రూ.55 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
Read Also: TG Cabinet: భూమిలేనివారికి రూ.6 వేలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ఈ కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే గవర్నర్ నుంచి రాష్ట్ర సర్కారు అనుమతి కోరింది. కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు పదేపదే చేసిన విజ్ఞప్తి చేశారు. అయితే న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఇందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏసీబీ ఇప్పుడు గతంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై తన దర్యాప్తును కొనసాగించవచ్చు. ఇందులో కేటీఆర్‌తో పాటు అప్పుడు హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!