Mandakrishna Madiga : ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం జరుగుతుందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చట్టసభలో తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ కు అండగా ఉన్నారని, షమీమ్ అక్తర్ నివేదికను ఆలస్యం లేకుండా ఆమోదించారన్నారు. వర్గీకరణను స్వాగతిస్తున్నామని, రిజర్వేషన్ పర్సంటేజ్ విషయంలో కొన్ని లోపాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కులాల చేర్పులు మార్పుల్లో లోటుపాట్లపై వినతి పత్రం అందజేశామని, మేం…
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎ రేవంత్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అధికారులు ఇసుక రీచ్ ల…
Rythu Bharosa : రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం అమలులో భాగంగా, ఫిబ్రవరి 5న ఒక ఎకరానికి లోపు భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం ప్రభుత్వం మరోసారి రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది.…
CM Revanth Reddy : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ని ఫోన్ లో పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం ఆయన చేస్తామని అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం అన్నారు, నిందితుల పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , గ్రంధాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తో కలసి రంగరాజన్ ని పరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి తో…
Harish Rao : హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎంపీ, పీఎంపీల మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు భారీగా ఆర్ఎంపీ, పీఎంపీలు తరలివచ్చారు. అయితే.. వారి ధర్నాకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆర్ఎంపీ, పీఎంపీలపై బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కేసులు లేవని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భయబ్రాంతులకు గురిచేసి , అక్రమ కేసులు పెడుతున్నారని, మేనిఫెస్టోలో…
సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమారితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సమావేశం అయ్యారు. అనంతరం సీఎస్‌కు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పారదర్శకంగా, శాస్త్రీయంగా కుల గణన సర్వేను నిర్వహిస్తున్నప్పటికీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సర్వే పూర్తిగా సమగ్రంగా, జాతీయ ప్రామాణికాలతో నిర్వహించబడుతోందని, అందుకు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించారని తెలిపారు. మొత్తం…
Anil Kumar Yadav : రాజ్యసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మూసీ నది ప్రస్తావించారు. దేశంలోని ముఖ్యమైన నదుల్లో మూసీ నది ఒకటని, గతంలో దీన్ని ముచ్కుందా అనే పేరుతో పిలిచేవారని గుర్తు చేశారు. ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఉద్భవించి, హైదరాబాద్ నగరాన్ని దాటి నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల గుండా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుందని వివరించారు. మూసీ నది గాఢమైన చరిత్రను కలిగి ఉందని, హైదరాబాద్…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ విస్తరణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో కొత్త సభ్యులను చేరుస్తారా లేదా కొందరిని తప్పిస్తారా అన్న విషయంలో తుది నిర్ణయం హైకమాండ్‌దే అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల కేసులను చట్ట ప్రకారం ముందుకు తీసుకెళతామని తెలిపారు. తాను సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. కుల…
Duddilla Sridhar Babu : పరిశ్రమలు, ఐటీ కంపెనీలు హైదరాబాద్ కే పరిమితము కాకుండా టైర్ 2, 3 నగరాలకు విస్తరించాలని ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 4500 కోట్లు 2016 నుంచి ఐటి పరిశ్రమలకు ప్రభుత్వ సబ్సిడీల బకాయిలు పెండింగులో ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుందని, ఏ ఉద్దేశ్యంతో పరిశ్రమలకు ప్రభుత్వం భూములు కేటాయించారో ఆ విధంగా పరిశ్రమలు సహేతుకమైన కారణం లేకుండా స్థాపించకపోతే భూముల పై టీఎస్ ఐఐసీ నిర్ణయం…