Aarogyasri CEO : ఆరోగ్యశ్రీ ఇంచార్జీ సీఈవో గా మరోసారి ఐఏఎస్ అధికారి కర్ణన్ నీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీ విభాగంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో నిన్నటి వరకు ఉన్న ceo శివ శంకర్ ని జిఏడీ కి అటాచ్ చేసింది తెలంగాణ సర్కార్.. నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కోఆర్డినేటర్లను నియమించారంటూ ఆరోపణలు వచ్చాయి.. జిల్లా కోఆర్డినేటర్ల నియామకానికి లక్షల్లో చేతులు మారినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆరోగ్యశ్రీ సీఈవోగా ఉన్న శివశంకర్ ను జిఏడీ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.. ప్రస్తుతం తెలంగాణ ఆరోగ్యశాఖ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గా ఉన్న కర్ణన్ కి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వంది. ఇదిలా ఉంటే.. ఈయనతో పాటు నిన్న మరో 7 గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయిన విషయం తెలిసిందే.
Yashika Aannand : అయ్య బాబోయ్.. స్లీవ్ లెస్ లో సెగలు పుట్టిస్తున్న యాషిక